ఢాకా: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో అంపైర్ నిర్ణయంపై అనుచితంగా ప్రవర్తించినందుకుగాను భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత పడింది. అంతేకాకుండా ఏకంగా మూడు డీమెరిట్ పాయింట్లు ఖాతాలో చేరాయి. టైగా ముగిసిన ఈ మ్యాచ్‌లో తను క్యాచ్ అవుట్ కాగా.. అంపైర్ నిర్ణయంపై హర్మన్ అసహనం వ్యక్తం చేసింది. ఈక్రమంలో వికెట్లను బ్యాట్‌తో కొట్టడంతో పాటు అంపైర్ తన్వీర్ అహ్మద్‌తో కోపంగా మాట్లాడుతూ పెవిలియన్ వైపు వెళ్లింది. అలాగే అవార్డుల కార్యక్రమంలోనూ అంపైర్‌ది చెత్త నిర్ణయ మని, వచ్చే పర్యటనలో వారిని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలుసు కుంటామని కామెంట్ చేసింది. ఈ మ్యాచ్‌లో డీఆర్‌ఎస్ లేకపోవడంతో భారత్ రివ్యూకు వెళ్లలేకపోయింది.