ABN
, First Publish Date – 2023-07-27T02:21:44+05:30 IST
ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు భారత పురుషులు, మహిళల ఫుట్‌బాల్ జట్లకు క్రీడా మంత్రిత్వశాఖ లైన్ క్లియర్ చేసింది.
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు భారత పురుషులు, మహిళల ఫుట్‌బాల్ జట్లకు క్రీడా మంత్రిత్వశాఖ లైన్ క్లియర్ చేసింది. అడ్డుగా ఉన్న అర్హత నిబంధనలను సడలించింది. భారత ఒలింపిక్ సంఘం రూల్స్ ప్రకారం ఆసియాలో టాప్-8 ర్యాంక్‌ల్లో ఉన్న జట్లకే ఆసియాడ్‌కు అనుమతి. కానీ ఆ జాబితాలో భారత జట్లకు చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఫుట్‌బాల్ టీమ్‌లు ఆసియాడ్‌లో పాల్గొనేందుకు ఐవోఏ అనుమతించక పోవడంతో.. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య క్రీడా మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. అయితే, ఇటీవలే జరిగిన ఈవెంట్లతో జాతీయ జట్ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకొన్న ప్రభుత్వం ఆసియా క్రీడల్లో భారత ఫుట్‌బాల్ టీమ్‌లు పాల్గొనేందుకు నిబంధనలను సడలించినట్టు కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు.
Updated Date – 2023-07-27T02:21:44+05:30 IST