నందిగామ నియోజకవర్గం: నందిగామ టీడీపీలో గ్రూపు తగాదాలు వైసీపీకి లాభిస్తాయా?

నందిగామ నియోజకవర్గం: నందిగామ టీడీపీలో గ్రూపు తగాదాలు వైసీపీకి లాభిస్తాయా?

నందిగామ నియోజకవర్గంలో టీడీపీ గ్రూపు తగాదాలు వైసీపీకి లాభించే పరిస్థితి కనిపిస్తోంది. క్యాడర్ ను ఏకతాటిపైకి తీసుకురాగలిగితే టీడీపీ విజయాన్ని అడ్డుకోలేమన్న చర్చ కూడా సాగుతోంది.

నందిగామ నియోజకవర్గం: నందిగామ టీడీపీలో గ్రూపు తగాదాలు వైసీపీకి లాభిస్తాయా?

నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం

నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం: టీడీపీకి కంచుకోట నందిగామ.. 30 ఏళ్లుగా ఇక్కడ ఓడిపోని తెలుగుదేశానికి గత ఎన్నికలు షాకిచ్చాయి. వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు విజయం సాధించి టీడీపీకి ఓటమి రుచి చూపించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా జగన్మోహనరావు పనితీరు ఎలా ఉంది? టీడీపీ పునరాగమనం చేయగలదా? లేక మళ్లీ వైసీపీ జెండా ఎగురుతుందా?

మొండితోక జగన్ మోహన్ రావు

మొండితోక జగన్ మోహన్ రావు

నందిగామ నియోజకవర్గంలో ఓటర్లు చురుగ్గా ఉన్నారు. తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన వారికే పట్టం కడతారనేది రాజకీయ వర్గాల అభిప్రాయం. మూడు దశాబ్దాలుగా విజయం సాధించిన టీడీపీకి ఇక్కడ పటిష్టమైన క్యాడర్ ఉంది. 2019లో ఓటమి అంటే ఏంటో తెలియని ఆ పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు షాక్ ఇచ్చారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత 2019లో తొలిసారి ఇక్కడ టీడీపీయేతర పార్టీ విజయం సాధించగా.. వృత్తిరీత్యా వైద్యుడైన జగన్మోహనరావు 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ పట్టుదలతో 2019లో ఘనవిజయం సాధించారు.

మొండితోక అరుణ్ కుమార్

మొండితోక అరుణ్ కుమార్

ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి వచ్చే నందిగామ నియోజకవర్గంలో వైసీపీ రాజకీయ ఆధిపత్యం కొనసాగుతోంది. ఎమ్మెల్యే జగన్మోహనరావు రికార్డు విజయం సాధిస్తే, ఆయన సోదరుడు అరుణ్ కుమార్ (మొండితోక అరుణ్ కుమార్)ని వైసీపీ ఎమ్మెల్సీ చేసింది. నియోజకవర్గంలో ఇద్దరు అన్నదమ్ములు పార్టీని బలంగా నడిపిస్తున్నారు. ఎమ్మెల్యే జగన్మోహనరావుపై ఎలాంటి ఆరోపణలు లేకపోవడంతో క్లీన్ ఇమేజ్ ఉన్న ఆయనకు మరోసారి టిక్కెట్టు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇద్దరు అన్నదమ్ముల్లో ఎవరికి ఇస్తారన్నది సస్పెన్స్. ఎమ్మెల్యే జగన్మోహనరావుపై వ్యతిరేకత లేకపోయినప్పటికీ ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌కు నాయకత్వంతో సత్సంబంధాలున్నాయి. ఈ రెండింటిలో ఎవరికి దక్కుతుందనే అభిప్రాయం కేడర్‌లో ఉంది. రోడ్ల విస్తరణ, సెంట్రల్ విద్యాలయం, రెవెన్యూ డివిజన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు వంటి అభివృద్ధి పనులతో పాటు పలు సమస్యలను ఎమ్మెల్యే పరిష్కరించారు. అయితే చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో కార్యకర్తలు వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఏం చేసినా మళ్లీ గెలుస్తానని ఎమ్మెల్యే జగన్మోహనరావు అంటున్నారు.

తంగిరాల సౌమ్య

తంగిరాల సౌమ్య

గత ఎన్నికలు ఇచ్చిన అత్యుత్సాహంతో మళ్లీ గెలుపే ధ్యేయంగా వైసీపీ పనిచేస్తుండగా.. ప్రతిపక్ష టీడీపీలో మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితి నెలకొంది. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఈ నియోజకవర్గాన్ని గ్రూపు విభేదాలు వెంటాడుతున్నాయి. ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు కేశినేని చిన్ని టీడీపీ వర్గాలుగా చీలిపోయారు. ఎంపీ కేశినేని నాని అవకాశం దొరికినప్పుడల్లా పార్టీ ఇంచార్జి తంగిరాల సౌమ్యను ఇబ్బంది పెడుతున్నారని కార్యకర్తలు అంటున్నారు. గత కొంతకాలంగా ఎంపీ నాని నందిగామకు తరచూ వస్తున్నారు. ఈ యాత్రల్లో స్వపఖని కంటే ప్రత్యర్థి పార్టీకి చెందిన ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ లను ఆకాశానికి ఎత్తేయడం హాట్ టాపిక్ గా మారుతోంది. క్యాడర్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని సౌమ్య వర్గం ఎంపీపై నాయకత్వానికి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఎంపీపీ వర్గం ఇంచార్జి సౌమ్యపై కొత్త అభ్యర్థిని బరిలోకి దింపేందుకు పావులు కదుపుతోంది. స్థానిక నినాదంతో కన్నెగంటి జీవరత్నం అనే నాయకుడికి టికెట్ ఇవ్వాలని ఎంపీ వర్గం ప్రతిపాదిస్తోంది. ఈ ప్రతిపాదనను పార్టీ అధినేత చంద్రబాబు తోసిపుచ్చినా ఇన్‌ఛార్జ్ సౌమ్య తలనొప్పి మాత్రం తగ్గలేదు.

ఇది కూడా చదవండి: రోజురోజుకూ వేడెక్కుతున్న మచిలీపట్నం రాజకీయం.. ఈసారి పోటీ మాములుగా ఉండదు!

తండ్రి తంగిరాల ప్రభాకర్ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన సౌమ్య అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై గట్టిపోటీని ఇవ్వలేక పోతున్నారనే ఫిర్యాదులున్నాయి. మరోవైపు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమ ఆధిపత్యాన్ని సౌమ్య అడ్డుకోలేకపోతోంది. ఉమ పొడగించని నాని వర్గం సౌమ్యను టార్గెట్ చేయడం కష్టమైంది. అయితే మూడు రాజధానుల అంశం కలిసి వస్తుందని టీడీపీ నమ్మకంగా ఉంది. కమ్మ సామాజికవర్గం బలం టీడీపీకి లాభమని అంటున్నారు.

ఇది కూడా చదవండి: గన్నవరంలో వంశీ బలం.. పట్టాభి దూకుడు టీడీపీకి మైనస్‌గా మారనుందా?

మొత్తానికి టీడీపీలో గ్రూపు తగాదాలు వైసీపీకి లాభించేలా పరిస్థితి కనిపిస్తోంది. క్యాడర్ ను ఏకతాటిపైకి తీసుకురాగలిగితే టీడీపీ విజయాన్ని అడ్డుకోలేమన్న చర్చ కూడా సాగుతోంది. అయితే ఎన్ని గ్రూపులు వచ్చినా సౌమ్యకు మించిన నాయకుడు లేకపోవడంతో సౌమ్యకే టికెట్ గ్యారెంటీ అని అంటున్నారు. వైసీపీలోనూ సేమ్ సీన్.. మొండి సోదరుల్లో ఒకరు అభ్యర్థి కావడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే పాత ప్రత్యర్థుల మధ్య మళ్లీ పోటీ ఉంటుంది. మరి ఓటర్లు ఎవరిని ఆదరిస్తారో.. ఎవరిని గెలిపిస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *