ABN
, First Publish Date – 2023-07-27T02:28:15+05:30 IST
శ్రీలంక(Sri Lanka)తో రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్(Pakistan) బ్యాటర్లు శతకాలతో హోరెత్తించారు. ఓపెనర్ అబ్దుల్లా షఫిక్ (201) కెరీర్‌లో అత్యుత్తమ స్కోరుతో చెలరేగగా, ఆఘా సల్మాన్(Agha Salman) (148 బంతుల్లో 132 నాటౌట్) మెరుపు శతకం సాధించాడు.
అబ్దుల్లా డబుల్.. సల్మాన్ సెంచరీ
పాక్ తొలి ఇన్నింగ్స్ 563/5
శ్రీలంకతో రెండో టెస్ట్
కొలంబో : శ్రీలంక(Sri Lanka)తో రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్(Pakistan) బ్యాటర్లు శతకాలతో హోరెత్తించారు. ఓపెనర్ అబ్దుల్లా షఫిక్ (201) కెరీర్‌లో అత్యుత్తమ స్కోరుతో చెలరేగగా, ఆఘా సల్మాన్(Agha Salman) (148 బంతుల్లో 132 నాటౌట్) మెరుపు శతకం సాధించాడు. దాంతో బుధవారం ఆట ముగిసే సరికి పాకిస్థాన్ 563/5తో భారీ స్కోరు చేసింది. ఆతిథ్య జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే కుప్పకూలడంతో బాబర్ సేన 397 రన్స్ ఆధిక్యంలో కొనసాగుతోంది. వర్షంతో మంగళవారం, రెండో రోజు ఆట 10 ఓవర్లే జరగ్గా..అప్పటికి 178/2 స్కోరుతో ఉన్న పాకిస్థాన్ మూడో రోజును ప్రారంభించింది. కిందటిరోజు 87 రన్స్‌తో ఆడుతున్న షఫిక్ డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. మూడో రోజు ఆఖరికి సల్మాన్‌తో పాటు కంకషన్ ఆటగాడు రిజ్వాన్ (37 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
సాద్ షకీల్ చరిత్ర: మిడిలార్డర్ బ్యాటర్ సాద్ షకీల్ (57) చరిత్ర సృష్టించాడు. తొలి ఏడు టెస్ట్‌ల్లో 50 అంతకుపైగా పరుగులు చేసిన మొదటి బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. అతడి ఖాతాలో రెండు ద్విశతకాలు కూడా ఉన్నాయి.
Updated Date – 2023-07-27T02:28:15+05:30 IST