Sindhu: సింధు..తొలిరౌండ్లోనే | Sindhu..in the first round

Sindhu: సింధు..తొలిరౌండ్లోనే | Sindhu..in the first round



ABN
, First Publish Date – 2023-07-27T02:24:35+05:30 IST

ఫామ్‌ కోల్పోయి.. కెరీర్‌లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు(PV Sindhu)కు జపాన్‌ ఓపెన్‌ తొలి రౌండ్లోనే షాక్‌ తగిలింది. సహచర షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్‌ జోడీ, లక్ష్యసేన్‌ ప్రీక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు.

Sindhu: సింధు..తొలిరౌండ్లోనే

లక్ష్యసేన్‌, సాత్విక్‌ జోడీ ముందంజ

టోక్యో: ఫామ్‌ కోల్పోయి.. కెరీర్‌లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు(PV Sindhu)కు జపాన్‌ ఓపెన్‌ తొలి రౌండ్లోనే షాక్‌ తగిలింది. సహచర షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్‌ జోడీ, లక్ష్యసేన్‌ ప్రీక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు. బుధవారం జరిగిన సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సింధు 12-21, 13-21తో ఝాంగ్‌ యి మన్‌ (చైనా) చేతిలో చిత్తుగా ఓడింది. కెనడా ఓపెన్‌ విజేత లక్ష్యసేన్‌ సింగిల్స్‌ తొలి రౌండ్‌లో 21-15, 12-21, 24-22తో భారత్‌కే చెందిన ప్రియాన్షు రజావత్‌పై నెగ్గి రెండో రౌండ్లోకి ప్రవేశించగా, మరో మ్యాచ్‌లో మిథున్‌ మంజునాథ్‌ ఓటమి పాలయ్యాడు. రెండో రౌండ్‌లో కంటా సునియమ (జపాన్‌)తో లక్ష్యసేన్‌ తలపడనున్నాడు. డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడీ 21-16, 11-21, 21-13తో లియో రాలీ కార్నాండో-మార్టిన్‌ (ఇండోనేసియా)పై గెలిచి, ముందంజ వేసింది. ఈ గెలుపుతో వీరి వరుస విజయాల సంఖ్య 11కి చేరుకుంది.

Updated Date – 2023-07-27T02:24:42+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *