Southzone: వెస్ట్‌పై సౌత్‌జోన్‌ గెలుపు | Southzone win over West



ABN
, First Publish Date – 2023-07-27T02:44:03+05:30 IST

మయాంక్‌ అగర్వాల్‌ (98) అర్ధ శతకంతో రాణించడంతో.. దేవధర్‌ ట్రోఫీలో సౌత్‌జోన్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.

 Southzone: వెస్ట్‌పై సౌత్‌జోన్‌ గెలుపు

పుదుచ్చేరి: మయాంక్‌ అగర్వాల్‌ (98) అర్ధ శతకంతో రాణించడంతో.. దేవధర్‌ ట్రోఫీలో సౌత్‌జోన్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో సౌత్‌ జోన్‌ 12 పరుగుల తేడాతో వెస్ట్‌జోన్‌పై గెలిచింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌత్‌జోన్‌ 46.4 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. పార్థ్‌ భట్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో వెస్ట్‌జోన్‌ 36.2 ఓవర్లలో 194 పరుగులకు కుప్పకూలింది. సర్ఫరాజ్‌ ఖాన్‌ (42) టాప్‌ స్కోరర్‌. సాయి కిషోర్‌ మూడు తీశాడు. మరో మ్యాచ్‌లో నార్త్‌ జోన్‌ 48 పరుగుల తేడాతో సెంట్రల్‌జోన్‌పై నెగ్గింది. అలాగే ఈస్ట్‌జోన్‌ 8 వికెట్ల తేడాతో నార్త్‌ఈస్ట్‌జోన్‌పై విజయం సాధించింది.

Updated Date – 2023-07-27T02:44:03+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *