హీరో అజిత్ కుమార్ కొత్త చిత్రం ‘విడముయార్చి’లో త్రిష కథానాయికగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ప్లేస్‌లో తమన్నా ఎంపికైంది. తమన్నా గతంలో అజిత్ సరసన ‘వీరం’ చిత్రంలో నటించింది. ఇప్పుడు కూడా అజిత్ సూచన మేరకు మిల్కీ బ్యూటీ తమన్నాను కోలీవుడ్ నిర్మాతలు సంప్రదిస్తున్నారు. ‘తుణీవు’ సక్సెస్ తర్వాత అజిత్ హీరోగా మగిల్ తిరుమేని దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గత నెలలోనే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల సెట్స్ పైకి వెళ్లలేదు. వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేశారు.
అయితే ముందుగా హీరోయిన్ గా త్రిషను ఎంపిక చేశారు. కానీ, షూటింగ్ ఆలస్యం కావడంతో కాల్ షీట్స్ సర్దుబాటు చేయలేక ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో ఆమె స్థానంలో తమన్నాను ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. హీరో అజిత్ సూచన మేరకు మిల్కీబ్యూటీని సంప్రదించారట. అయితే ఇందులో తమన్నా నటిస్తుందా? లేదా? అన్నది తెలియాలి.
మరోవైపు, తమన్నా కోలీవుడ్‌లో నటించిన ‘జైలర్’ ఆగస్టు 10న విడుదల కానుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న తమన్నా.. రీసెంట్‌గా అజిత్ టూర్‌ను ముగించుకుంది. ప్రస్తుతం తమన్నా చేతిలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో అజిత్‌తో సినిమాకి ఓకే చెప్పే అవకాశం ఉంది. చూద్దాం.. చివరకు ‘విడమూర్చి’లో హీరోయిన్ ఎవరో?
****************************************
****************************************
****************************************
****************************************
****************************************
****************************************
నవీకరించబడిన తేదీ – 2023-07-28T17:08:24+05:30 IST