ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌: అగ్రస్థానంలో టీమిండియా స్పిన్‌ ద్వయం

వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న టీమిండియా ప్రస్తుతం రెండు టెస్టుల సిరీస్‌ ఆడుతోంది. ఇప్పటికే తొలి టెస్టు మూడు రోజుల్లోనే పూర్తయి అద్భుత విజయం సాధించింది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రధాన స్పిన్నర్ అశ్విన్ (రవిచంద్రన్ అశ్విన్) అద్భుతంగా ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు మొత్తం 12 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో అశ్విన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతని ఖాతాలో 884 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా కూడా తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నాడు. 779 రేటింగ్ పాయింట్లతో ఏడో స్థానానికి చేరుకున్నాడు. బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా పేస్ బౌలర్ పాట్ కమిన్స్ రెండో స్థానంలో ఉన్నాడు. అతని ఖాతాలో 828 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఆ తర్వాత కగిసో రబడ (825 పాయింట్లు), జేమ్స్ అండర్సన్ (805 పాయింట్లు), షాహీన్ షా ఆఫ్రిది (787 పాయింట్లు), స్టువర్ట్ బ్రాడ్ (781 పాయింట్లు) వరుస స్థానాల్లో కొనసాగుతున్నారు.

బ్యాటింగ్ విభాగంలో న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ 883 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. టీమ్ ఇండియా నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమే టాప్-10లో ఉన్నాడు. 751 రేటింగ్ పాయింట్లతో పదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ (874 పాయింట్లు) రెండో స్థానంలో, బాబర్ అజామ్ (862 పాయింట్లు) మూడో స్థానంలో, స్టీవ్ స్మిత్ (855 పాయింట్లు) నాలుగో స్థానంలో, లబుషానే ఐదో స్థానంలో (849 పాయింట్లు), జో రూట్ (842 పాయింట్లు) ఆరో స్థానంలో, జో రూట్ (842 పాయింట్లు) ఏడో స్థానంలో ఉన్నాడు. ఉస్మాన్ ఖవాజా (824 పాయింట్లు), డారిల్ మిచెల్ (792 పాయింట్లు) 8వ స్థానంలో, కరుణ రత్నే (780 పాయింట్లు) 9వ స్థానంలో ఉన్నారు.

ఇది కూడా చదవండి: ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడు..?

మరోవైపు ఆల్ రౌండర్ విభాగంలో టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా అగ్రస్థానంలో ఉన్నాడు. అతని ఖాతాలో 449 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రవిచంద్రన్ అశ్విన్ (362 పాయింట్లు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. షకీబుల్ హసన్ (332 పాయింట్లు), బెన్ స్టోక్స్ (331 పాయింట్లు), అక్షర్ పటేల్ (303 పాయింట్లు), జాసన్ హోల్డర్ (284 పాయింట్లు), జో రూట్ (256 పాయింట్లు), మిచెల్ స్టార్క్ (245 పాయింట్లు), కైల్ మేయర్స్ (245 పాయింట్లు), పాట్ కమిన్స్ (229 పాయింట్లు) వరుస స్థానాల్లో కొనసాగుతున్నాడు. మరోవైపు ఈ నెల 20 నుంచి భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టెస్టు జరగనుంది. భారత స్పిన్ ద్వయం అశ్విన్, జడేజా ఈ టెస్టులోనూ రాణించాలని జట్టు కోరుకుంటోంది.

నవీకరించబడిన తేదీ – 2023-07-19T17:19:16+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *