రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) స్టార్ రెజ్లర్లు బజరంగ్ పునియా (65 కిలోలు), వినేష్ ఫోగట్ (53 కిలోలు)లకు ట్రయల్ లేకుండానే ఆసియాడ్ బెర్త్‌లను ఖరారు చేసింది.
పునియా, వినేష్
కొంతమంది మల్లయోధుల అసంతృప్తి
న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) స్టార్ రెజ్లర్లు బజరంగ్ పునియా (65 కిలోలు), వినేష్ ఫోగట్ (53 కిలోలు)లకు ట్రయల్ లేకుండానే ఆసియాడ్ బెర్త్‌లను ఖరారు చేసింది. ఇదంతా కోచ్‌లకు తెలియకుండానే జరిగినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరిని నేరుగా ఎంపిక చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఇతర రెజ్లర్లు.. వారి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్రీస్టైల్ పురుషుల 65 కేజీలు, మహిళల 53 కేజీల కేటగిరీ రెజ్లర్లను ఇప్పటికే ఎంపిక చేశామని.. అయితే శని, ఆదివారాల్లో ఆరు కేటగిరీల్లో ట్రయల్స్ నిర్వహిస్తామని అడ్ హాక్ ప్యానెల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఎక్కడా ప్రస్తావించనప్పటికీ, బజరంగ్ మరియు వినేష్ ఇద్దరికీ బెర్త్‌లు ఖరారైనట్లు ప్యానెల్ సభ్యుడు అశోక్ గార్గ్ ధృవీకరించారు. నిబంధనల ప్రకారం, ఒలింపిక్ మరియు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో పతకాలు సాధించిన ఆటగాళ్లను ట్రయల్స్ నుండి మినహాయించవచ్చు. అయితే, కోచ్‌లు వారి పేర్లను సిఫారసు చేయాలి. WFI మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ పునియా మరియు ఫోగట్ కొన్ని నెలలుగా ఏ టోర్నమెంట్‌లోనూ పాల్గొనకుండా నిరసనలు చేస్తున్నారు.
బ్రిజ్‌భూషణ్‌కు బెయిల్..
లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్‌భూషణ్‌కు విముక్తి లభించింది. ఢిల్లీ కోర్టు రూ. 25,000 పూచీకత్తుతో అతనికి రెండు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేయలేదని, విచారణకు సహకరిస్తున్నందున సింగ్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్‌కు గురైన డబ్ల్యూఎఫ్‌ఐ కార్యదర్శి వినోద్ తోమర్‌కు కూడా బెయిల్ లభించింది.
నవీకరించబడిన తేదీ – 2023-07-19T02:30:40+05:30 IST