సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలపై ఇష్టం వచ్చినట్లు దాడులు చేస్తున్నారు. అపోహలు సృష్టించి తమకు నచ్చని వ్యక్తులపై దుష్ప్రచారం చేస్తూ అవి నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు టీడీపీ మహిళా నేత వంగలపూడి జర్నలిస్టు సజ్జనరావు కుటుంబంపై దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ అనిత నోరు అదుపులో పెట్టుకోవాలని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారని ఆంధ్రజ్యోతి కథనం రాసిందని వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది.
జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న చీప్ ట్రిక్స్ అదుపు తప్పుతున్నాయి. సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలపై ఇష్టం వచ్చినట్లు దాడులు చేస్తున్నారు. అపోహలు సృష్టించి తమకు నచ్చని వ్యక్తులపై దుష్ప్రచారం చేస్తూ అవి నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా వైసీపీ పెద్దల కనుసన్నల్లోనే జరుగుతోందని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ మహిళా నేత వంగలపూడి అనితపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ఆంధ్రజ్యోతి’ని అడ్డం పెట్టుకుని కుట్ర పన్నింది.
జర్నలిస్టు సజ్జనరావు కుటుంబంపై టీడీపీ మహిళా నేత వంగలపూడి దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ అనిత నోరు అదుపులో పెట్టుకోవాలని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారని ఆంధ్రజ్యోతి కథనం రాసిందని వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. పైగా అనిత తీరు టీడీపీలోని పెద్దలకు అందడం లేదని ప్రజలను నమ్మించేందుకు విఫలయత్నం చేశారు. అయితే ఈ కథనాన్ని ఆంధ్రజ్యోతి యాజమాన్యం పూర్తిగా ఖండించింది. ఇది పూర్తిగా వైసీపీ నేతలే సృష్టించినట్లు స్పష్టమవుతోంది.
ఇది కూడా చదవండి: Nara Lokesh: జగన్ పై నారా లోకేష్ సెటైర్.. మాములుగా లేదు..!!
ఏపీలో మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ శుక్రవారం టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలు కనిపించకుండా పోతున్నారని, మహిళలపై దాడులు, వేధింపులు జరుగుతున్నాయని, మహిళలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా పోస్టులు పెడుతున్నారని, మానసిక క్షోభ కలిగిస్తున్నారని వంగలపూడి అనిత ఆరోపించారు. ఈ నేపథ్యంలో వంగలపూడి అనితపై కక్షపూరితంగా వ్యవహరించేందుకు వైసీపీ కుట్ర పన్నుతోంది. ఆంధ్రజ్యోతిని అడ్డం పెట్టుకుని అపోహ సృష్టించారు.
నవీకరించబడిన తేదీ – 2023-07-22T14:20:15+05:30 IST