ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని సెప్టెంబర్ 15, 2023 వరకు పొడిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు స్వీకరించింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం ఈ అప్పీల్‌ను పరిగణనలోకి తీసుకుందని కోర్టు పేర్కొంది.
న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని సెప్టెంబర్ 15, 2023 వరకు పొడిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు స్వీకరించింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం ఈ అప్పీల్‌ను పరిగణనలోకి తీసుకుందని కోర్టు పేర్కొంది. ప్రస్తుతం జరుగుతున్న ఎఫ్ ఏటీఎఫ్ సమీక్షలో సంజయ్ కుమార్ గైర్హాజరు కావడం ప్రతికూల ప్రభావం చూపుతుందని, దేశ ప్రయోజనాల దృష్ట్యా సంజయ్ కుమార్ పదవీకాలాన్ని పొడిగించేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
కాగా, ఈడీ చీఫ్‌గా ఉన్న సంజయ్‌కుమార్ పదవీకాలాన్ని మూడోసారి పొడిగించేందుకు సుప్రీంకోర్టు జూలై 11న విముఖత వ్యక్తం చేసింది. 2021 తీర్పుకు వ్యతిరేకమని కొట్టిపారేసింది. అయితే, బదిలీ ప్రక్రియను సజావుగా కొనసాగించాలనే ఉద్దేశ్యంతో సంజయ్ కుమార్‌ను జూలై 31, 2023 వరకు కొనసాగించేందుకు అనుమతించారు. అయితే సమీక్ష కీలకమైన దశలో ఉందని, ఈ సమయంలో ఆయన గైర్హాజరు కావడం వల్ల ఎదురయ్యే పరిణామాలను FATF జూలై 21, 2023న కోర్టుకు తెలియజేసింది. ఆన్-సైట్ సందర్శన నవంబర్ 2023లో జరగనుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా మనీలాండరింగ్ పరిశోధనలు, ప్రక్రియల్లో ఈడీ చీఫ్‌గా చాలా ముఖ్యమైన వ్యక్తి అని ఆయన వివరించారు.
నవీకరించబడిన తేదీ – 2023-07-27T18:00:22+05:30 IST