తనను వ్యక్తిగతంగా విమర్శించిన జగన్ ను ఉద్దేశించి టీడీపీ యువనేత నారా లోకేష్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. అందులో ‘ఎందరో మహానుభావులు.. ఒకే ఒక్క ‘చౌక’ మంత్రి అంటూ లోకేష్ ఫోటో షేర్ చేశారు. ఏపీకి సేవలు అందించిన మాజీ సీఎంలందరూ ఒకవైపు ఉండగా.. ఏ సందర్భంలోనైనా పగలబడి నవ్వుకునే జగన్ మరోవైపు ఉన్నారు. ఈ సందర్భంగా లోకేష్ ఫోటోకు ముఖ్యమంత్రులు వర్సెస్ చీప్ మినిస్టర్స్ అని క్యాప్షన్ పెట్టారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేష్ అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడుతూ తన యాత్రను కొనసాగిస్తున్నారు. ఆయన పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. లోకేష్ ఎక్కడ సభలు నిర్వహించినా జనం పెద్దఎత్తున హాజరవుతున్నారు. ప్రజా స్పందన చూసి అధికార పార్టీ వైసీపీ నేతలు యువనేతపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా శుక్రవారం వెంకటగిరిలో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ (జగన్‌మోహన్‌రెడ్డి) లోకేష్‌పై పరోక్ష ఆరోపణలు చేశారు. దీంతో జగన్ పై నారా లోకేష్ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తూ చేసిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది.
తనను వ్యక్తిగతంగా విమర్శించిన జగన్ ను ఉద్దేశించి టీడీపీ యువనేత నారా లోకేష్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. అందులో ‘ఎందరో మహానుభావులు.. ఒకే ఒక్క ‘చౌక’ మంత్రి అంటూ లోకేష్ ఫోటో షేర్ చేశారు. ఏపీకి సేవలు అందించిన మాజీ సీఎంలందరూ ఒకవైపు ఉండగా.. ఏ సందర్భంలోనైనా పగలబడి నవ్వుకునే జగన్ మరోవైపు ఉన్నారు. ఈ సందర్భంగా లోకేష్ ఫోటోకు ముఖ్యమంత్రులు వర్సెస్ చీప్ మినిస్టర్స్ అని క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. కొందరు టీడీపీ అభిమానులు జగన్ ను బిత్తర కుమార్ అని సంబోధిస్తున్నారు. రాష్ట్ర ప్రజా సమస్యలపై వ్యక్తిగత దూషణలు చేస్తూ ప్రతిపక్ష నేతలను సీఎం జగన్ పరువు తీస్తున్నారని కొందరు పోస్ట్ చేస్తున్నారు.
ముఖ్యమంత్రి పదవికి విలువ ఉంటుందని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి:
***************************************************** ************************************************* ********
***************************************************** ************************************************* ******** **
నవీకరించబడిన తేదీ – 2023-07-22T12:52:56+05:30 IST