టీజీ భరత్ పై కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఫైర్ అయ్యారు. కరోనా సమయంలో డా.ఇస్మాయిల్ చనిపోతే తండ్రీకొడుకులు ఇద్దరూ చూసేందుకు కూడా రాలేదని, డాక్టర్ ఇస్మాయిల్‌పై నెగెటివ్ ప్రచారం జరిగినా కనీసం స్పందించలేదన్నారు.

హఫీజ్ ఖాన్ – BY రామయ్య
టీజీ వెంకటేష్ – టీజీ భరత్: టీజీ వెంకటేష్, టీజీ భరత్‌పై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. టీడీపీపై కర్నూలు మేయర్ బీవై రామయ్య ఫైర్ అయ్యారు. టీడీపీ కర్నూలు అసెంబ్లీ స్థానానికి ఎవరు పోటీ చేసినా తమకు సవాలేనని అన్నారు. సొంత తండ్రి కొడుకే ఓటు వేయలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. తండ్రి టీజీ వెంకటేష్ బీజేపీ అని, కొడుకు టీజీ భరత్ టీడీపీ అని అన్నారు. ఆస్తులు కాపాడుకునేందుకే టీడీపీ అభ్యర్థి భరత్ పోటీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడారు.
టీడీపీ అభ్యర్థికి సొంత ఇంట్లో ఓట్లు పడవని.. అలాంటి వాళ్లు కర్నూలు జిల్లాను ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇద్దరు విపక్ష నేతలు దిక్కులేని వారిలా తిరుగుతున్నారని పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలే పార్టీకి ప్రాణం అని అన్నారు. ఇచ్చిన మాటను అమలు చేస్తున్నామని చెప్పారు.
టీజీ భరత్ పై కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఫైర్ అయ్యారు. కరోనా సమయంలో డా.ఇస్మాయిల్ చనిపోతే తండ్రీకొడుకులు ఇద్దరూ చూసేందుకు కూడా రాలేదని, డాక్టర్ ఇస్మాయిల్‌పై నెగెటివ్ ప్రచారం జరిగినా కనీసం స్పందించలేదన్నారు. టీజీ భరత్ పారిశ్రామిక వేత్త కావచ్చు కానీ ప్రజా నాయకుడు మాత్రం కాలేడని విమర్శించారు.
ఆస్తులు, ఫ్యాక్టరీలను కాపాడుకోవడానికి తండ్రి ఒక పార్టీ, కొడుకు మరో పార్టీ అని విమర్శించారు. మీలాగే మేం ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళ్లి ఆస్తులు కాపాడుకోము అని అన్నారు. ప్రజా సంక్షేమం కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్నారు.