అఖిలేష్ యాదవ్: అఖిలేష్ అడుగు ఎక్కడ..? కేసీఆర్ తో ఇటేమో దోస్తీ.. మళ్లీ అదేమో..!

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-07-03T17:54:19+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ రాజకీయంగా ఎటువైపు వెళుతుందో రాజకీయ వర్గాలకు తెలియడం లేదు. దానికి కారణం సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వైఖరే. అఖిలేష్ యాదవ్ రాజకీయ వ్యూహం అస్పష్టంగా ఉంది.

అఖిలేష్ యాదవ్: అఖిలేష్ అడుగు ఎక్కడ..?  కేసీఆర్ తో ఇటేమో దోస్తీ.. మళ్లీ అదేమో..!

దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉన్న రాష్ట్రం కావడంతో పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్న ప్రతిసారీ యూపీపై రాజకీయ చర్చ నడుస్తోంది. అయితే ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ ఎటువైపు అడుగులు వేస్తుందో రాజకీయ వర్గాలు అర్థం చేసుకోలేకపోతున్నాయి. దానికి కారణం సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వైఖరే. అఖిలేష్ యాదవ్ రాజకీయ వ్యూహం అస్పష్టంగా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సోమవారం ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు.

84f06251-f866-4246-a214-02b2763a9e19.jpg

మర్యాదపూర్వక భేటీ అని బీఆర్ఎస్, ఎస్పీ నేతలు చెబుతున్నా.. పూర్తిగా రాజకీయంగా అనుసరించాల్సిన వ్యూహాలపైనే భేటీ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ సందర్భంగా కేసీఆర్ మొదటి నుంచి చెబుతున్న ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. బీఆర్‌ఎస్ కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీ అని కేసీఆర్ చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాము ఎవరి బి-టీమ్ కాదని BRS నాయకత్వం చాలా గట్టిగా సమాధానం చెప్పింది. అలాంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో అఖిలేష్ యాదవ్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. బీఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా తెలంగాణలో కాంగ్రెస్ దూకుడుగా ముందుకు సాగుతోంది. జాతీయ స్థాయిలో కూడా బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ ప్రత్యర్థిగా చూస్తుంది కానీ బీజేపీయేతర పార్టీగా కాదు. బీఆర్‌ఎస్‌తో సమాజ్‌వాదీ దోస్తీకి వెళ్లడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

48286548-3f42-4847-9e95-cd7e6008009b.jpg

ఇక్కడ మరో పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీల్లో సమాజ్ వాదీ పార్టీ ఒకటి. విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్న బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఇటీవల పాట్నాలో ‘మిషన్ 2024’ విపక్షాల సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్, యూపీ మాజీ సీఎం, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతికి ఆహ్వానం అందలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి కాబట్టే ఆ పార్టీతో చేతులు కలపడానికి కేసీఆర్ సిద్ధంగా లేరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రతిపక్ష కూటమిలో చేరబోనని మాయావతి స్పష్టం చేశారు. ఇలా.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ పార్టీల్లో ఒక్క సమాజ్ వాదీ తప్ప మిగతా పార్టీలన్నీ దాదాపుగా క్లియర్ అయిపోయాయి.

1dd02ac3-bf12-4780-9b02-1988bbf7f217.jpg

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌తో అఖిలేష్ దోస్తీ పాట పాడుతుండడంతో సమాజ్‌వాదీ పార్టీ వ్యూహం ఏమిటో అర్థం కావడం లేదు. ఇదిలా ఉంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌తో ఏ రాజకీయ పార్టీ చేతులు కలుపుతుందనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అని ఆ పార్టీ అధినేత కేసీఆర్ చెబుతున్నా ఆ స్థాయిలో పార్టీ చేరికలు, విస్తరణ జరగలేదు. దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ యేతర రాజకీయ పార్టీల నేతలను కేసీఆర్ చాలాసార్లు కలిశారే తప్ప.. బీఆర్ ఎస్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించిన రాజకీయ పార్టీ ఏదీ లేదనే చెప్పాలి. దేశ రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌కు పెద్దపీట వేయనప్పటికీ కేసీఆర్‌తో రాజకీయ చర్చలు జరిపేందుకు ఉత్తరప్రదేశ్ నుంచి అఖిలేష్ యాదవ్ వచ్చారు. దేశంలోనే ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ప్రత్యర్థిగా ఉన్న బీఆర్‌ఎస్ అధినేతను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

నవీకరించబడిన తేదీ – 2023-07-03T18:01:21+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *