ప్రపంచ నంబర్ వన్ టెస్ట్ బౌలర్ ఆర్.అశ్విన్ గిరగిరా తిప్పిన బంతులు ఆతిథ్య వెస్టిండీస్‌ను వణికించాయి. తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లతో ఆకట్టుకున్న అశ్విన్ ఈసారి ఏడు వికెట్లతో ఫర్వాలేదనిపించాడు.
రెండో ఇన్నింగ్స్‌లో 130 ఆలౌట్
ఏడు వికెట్లతో చెలరేగిన స్పిన్నర్
దీంతో భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో విజయం సాధించింది
-
భారత్ తరఫున టెస్టుల్లో 10 వికెట్లు తీయడం అశ్విన్‌కి ఇది ఎనిమిదోసారి. కుంబ్లేతో సమానంగా అగ్రస్థానంలో నిలిచాడు.
-
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు (709) తీసిన రెండో భారత బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. కుంబ్లే (953) అగ్రస్థానంలో ఉండగా.. హర్భజన్ (707) అధిగమించాడు.
5. విదేశాల్లో మూడు రోజుల్లో టెస్టు గెలవడం భారత్‌కు ఇది ఐదోసారి.
రోసో: ప్రపంచ నంబర్ వన్ టెస్ట్ బౌలర్ ఆర్.అశ్విన్ గిరగిరా తిప్పిన బంతులు ఆతిథ్య వెస్టిండీస్‌ను వణికించాయి. తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లతో ఆకట్టుకున్న అశ్విన్ ఈసారి ఏడు వికెట్లతో ఫర్వాలేదనిపించాడు. దీంతో కరీబియన్లు తమ రెండో ఇన్నింగ్స్‌లో 50.3 ఓవర్లలో 130 పరుగులకే కుప్పకూలారు. ఫలితంగా మూడు రోజుల్లోనే భారత జట్టు ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో విజయం సాధించింది. అరంగేట్రం ఆటగాడు అతానాజ్ (28) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జడేజాకు రెండు వికెట్లు లభించగా, సిరాజ్‌కు ఒక వికెట్ దక్కింది. ఈ ఫలితంతో, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సీజన్‌కు భారత్ శుభారంభం చేసింది. అలాగే మొత్తం 12 వికెట్లు తీసిన అశ్విన్.. వెస్టిండీస్‌పై ఒకే టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. చివరిదైన రెండో టెస్టు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానుంది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేయగా, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 421/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
వికెట్ల వారీగా:
శుక్రవారం రెండో సెషన్‌లో ఇషాన్ కిషన్ తన తొలి టెస్టు పరుగు సాధించిన తర్వాత, కెప్టెన్ రోహిత్ భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌కి బరిలోకి దిగిన వెస్టిండీస్ నుంచి మెరుగైన ప్రదర్శన ఆశించినా.. స్పిన్‌కు చిక్కింది. ఐదో ఓవర్ నుంచి రోహిత్ స్పిన్నర్లను బరిలోకి దించాడు. దీంతో తొలి వికెట్ తీసిన జడేజా.. ఆ తర్వాత అశ్విన్ మ్యాజిక్ మొదలైంది. ఫలితంగా టీ విరామ సమయానికి 27/2తో ఉన్న ఈ జట్టు చివరి సెషన్ ముగిసే సమయానికి మిగిలిన ఎనిమిది వికెట్లను కోల్పోయింది. చివరి ఐదు వికెట్లు కూడా అశ్విన్ తీశాడు. విండీస్ ను ఆదుకునేందుకు ప్రయత్నించిన అతానాజ్ స్లిప్ వద్ద జైస్వాల్ క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత జోసెఫ్ (13)ను అశ్విన్ అవుట్ చేశాడు. ఒకే ఓవర్లో కార్న్‌వాల్ (4), రోచ్ (0)లను అశ్విన్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత మూడో రోజు ఆట ఓ ఓవర్‌తో ముగియాలి. అయితే విండీస్ బౌలింగ్‌కు ఇంకా ఒక వికెట్ దూరంలో ఉండటంతో అంపైర్లు ఆటను అరగంట పొడిగించారు. తర్వాతి మూడు ఓవర్లలో అశ్విన్ వారికన్ (18)ను కూడా అవుట్ చేయడంతో భారత్ భారీ విజయాన్ని అందుకుంది.
నవీకరించబడిన తేదీ – 2023-07-16T02:46:57+05:30 IST