డ్రై ఫ్రూట్స్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి ఎండుద్రాక్ష, బాదం, జీడిపప్పు, వాల్‌నట్‌లు మరియు అంజీర్.
ఎండుద్రాక్ష
డ్రై ఫ్రూట్స్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి ఎండు ద్రాక్ష, బాదం, జీడిపప్పు, వాల్ నట్స్ , అంజీర్ , వీటిని తింటే రోగాలకు దూరంగా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఎండుద్రాక్ష వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎండుద్రాక్షను ఆయుర్వేదంలో అనేక వ్యాధులకు ఉపయోగిస్తారు. ఇది చిన్నదిగా కనిపించినప్పటికీ, ఇందులో ఉండే ఖనిజ లవణాలు మరియు విటమిన్లు శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. ఎండుద్రాక్ష తింటే రోగాలకు చెక్ పెట్టొచ్చు. రుచిలో తీపి అయినా, పులుపు అయినా అందరూ ఇష్టపడి తింటారు. వీటిలో పాలీఫెనోలిక్ ఫైటోన్యూట్రియెంట్స్ ఉంటాయి. ఇవి మంటను తగ్గిస్తాయి. బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్‌ను నివారిస్తాయి. పొద్దున్నే తినిపించడం అలవాటు చేసుకుంటే పిల్లల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఎండుద్రాక్షలోని కాల్షియం దంతాలకు, ఎముకలకు మేలు చేస్తుంది. రక్తహీనతతో బాధపడే మహిళలకు ఎండుద్రాక్ష మంచి ఔషధం.
ఉపయోగాలు
-
ఎండుద్రాక్షలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తింటే రక్తహీనత సమస్య తీరుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
-
దంత సమస్యలు, చిగుళ్ల వ్యాధులు తగ్గుతాయి. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.
-
ఆయుర్వేదం ప్రకారం, వాత మరియు పిత్త దోషాలు ఉన్నవారికి ఎండుద్రాక్ష చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మూత్రపిండాలు, ప్రేగు మరియు మూత్రాశయం పనితీరును మెరుగుపరుస్తుంది.
-
ఊపిరితిత్తుల పనితీరు సరిగా లేని వారికి ఎండుద్రాక్ష చాలా ఉపయోగకరంగా ఉంటుంది
-
ఎండు ద్రాక్ష తినడం వల్ల సంతానోత్పత్తి పెరుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది.
-
ఇవి మెదడుకు మేలు చేస్తాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది.
-
ఎండుద్రాక్షలో పొటాషియం, క్యాటెచిన్స్, విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ బాధితులకు మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఫినాలిక్ పదార్థాలు వివిధ రకాల క్యాన్సర్లను నివారిస్తాయి.
-
ఎండు ద్రాక్షను నిత్యం తింటే రక్తపోటు, మధుమేహం అదుపులో ఉంటాయి. మీరు ఆకలితో ఉన్నప్పుడు స్నాక్స్ కంటే ఇవి చాలా మంచివి.
-
ఎండుద్రాక్షలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం మరియు విరేచనాలను నివారిస్తుంది. ఇది శరీరంలో మంచి బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడుతుంది.
అన్ని వయసుల వారు తినవచ్చు
ఎండుద్రాక్షలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వీటిని తినవచ్చు. ఎండుద్రాక్షలో కాపర్, బి మరియు సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడటమే కాకుండా రక్త సరఫరాను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చలికాలంలో ఎండు ద్రాక్ష తినడం వల్ల మలబద్ధకం, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు అదుపులో ఉంటాయి. –
– డాక్టర్ మహేందర్, చిల్డ్రన్స్ స్పెషలిస్ట్
హైదరాబాద్ , షాపూర్ నగర్ , మే 21 (ఆంధ్రజ్యోతి)
నవీకరించబడిన తేదీ – 2023-05-22T14:01:20+05:30 IST