తాజాగా కర్ణాటకలో సాధించిన విజయం పార్టీలో ఉత్సాహాన్ని నింపింది. అక్కడి ప్రజల కోసం ఐదు హామీ పథకాలను ప్రకటించి ఆ పార్టీకి ఎంతో ఆదరణ లభించింది. దీంతో కర్ణాటక ఫార్ములాను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే తెలంగాణలో పార్టీ పావులు కదుపుతోంది.
ఖమ్మంలో జనగర్జన సభ సూపర్ సక్సెస్ అయింది
రాహుల్ గాంధీ ప్రసంగమే తదుపరి ఎన్నికల ఎజెండా
కర్ణాటక తరహాలో ప్రజలపై వరాల జల్లు కురిపించారు
రాజకీయాల్లో అధికారం సాధించాలంటే ప్రజల్లో విశ్వాసం ఉండాలి. అందుకు తగ్గట్టుగానే వ్యూహాలతో ముందుకు సాగాలి. తెలంగాణలో గత పదేళ్లుగా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టే ప్రజల్లో విశ్వాసం నింపింది. అయితే ఇప్పుడు ఆ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయింది. రైతు రుణమాఫీ, ఉద్యోగాల కల్పనలో బీఆర్‌ఎస్ విఫలమైంది. హైదరాబాద్ మినహా ఇతర నగరాల్లో అభివృద్ధి అంతంత మాత్రంగానే కనిపిస్తోంది.
మరోవైపు తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. అందుకు కారణం లేకపోలేదు. ఎందుకంటే, ఇతర పార్టీల మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ కూడా తాయిలాలు ప్రకటించడంలో వెనుకబడి ఉంది. అయితే తాజాగా కర్నాటకలో గెలుపొందడం ఆ పార్టీకి ఊరటనిచ్చింది. అక్కడి ప్రజల కోసం ఐదు హామీ పథకాలను ప్రకటించి ఆ పార్టీకి ఎంతో ఆదరణ లభించింది. దీంతో కర్ణాటక ఫార్ములాను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే తెలంగాణలో పార్టీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఖమ్మంలో జరిగిన జన గర్జన సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రభుత్వ అవాంతరాలు ఎదురైనా కాంగ్రెస్ మొండిగా ఈ సమావేశాన్ని నిర్వహించిన తీరు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
జనగర్జన సభలో ప్రజలకు వరాలు ప్రకటించడంపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు పింఛన్ ఇస్తామని ఎవరూ ఊహించని రీతిలో ప్రకటించారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలుస్తోందని నమ్మబలికారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో తెలుసని ప్రజలు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ అవినీతిపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిపై దుమ్మెత్తి పోశారు. రాష్ట్రంలో త్రిముఖ పోరు లేదని.. బీఆర్‌ఎస్‌బీ పార్టీతోనే పోటీ చేస్తున్నామని ప్రకటించారు. మొత్తానికి ఖమ్మం సభ కాంగ్రెస్ పార్టీలో చైతన్యాన్ని నింపింది. తెలంగాణలోనూ ఇదే తరహాలో సభలు నిర్వహించాలని హస్తం పార్టీ నేతలు యోచిస్తున్నారు. మరోవైపు తమ పార్టీకి పెరుగుతున్న బలం కూడా కాంగ్రెస్ నేతల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది. కాగా, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రకటించిన బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పథకం అమలుపై కూడా కేసీఆర్ దృష్టి సారించారు. కాగా, తాము అధికారంలోకి వస్తే ఇక్కడి మహిళలకు కూడా బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
నవీకరించబడిన తేదీ – 2023-07-03T13:22:59+05:30 IST