స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ఓ నటుడితో డేటింగ్‌లో ఉందనే వార్త వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను తమన్నా తన తాజా ఇంటర్వ్యూలో ఖండించింది.
తమన్నా మరియు విజయ్ వర్మ
స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ఓ నటుడితో డేటింగ్‌లో ఉందనే వార్త వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ వార్తలను తమన్నా తన తాజా ఇంటర్వ్యూలో కొట్టిపారేసినప్పటికీ.. నిప్పు లేనిదే పొగ రాదు అనే వార్త ఇప్పటికీ హైలైట్ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఆమె అదే నటుడితో రొమాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ నటుడు ఎవరో కాదు.. నేచురల్ స్టార్ నాని నటించిన ‘ఎంసీఏ’ సినిమాలో విలన్‌గా నటించిన విజయ్ వర్మ. టాలీవుడ్‌లో ఒకట్రెండు సినిమాలు పూర్తి చేసినా, విజయ్ వర్మ బాలీవుడ్‌లో బిజీ నటుడిగా కొనసాగుతున్నాడు. తమన్నా, విజయ్ వర్మ గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నారు. తాము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలను ఇటీవల మీడియా సమావేశంలో తమన్నా ఖండించింది.
ప్రేమ, పెళ్లి ఏదైనా సరే ముందుగా మీడియాకు చెబుతానని చెప్పింది. ఈ మాటలు చెప్పి కొన్ని రోజులు కూడా గడవకముందే.. ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో ఆమెకు ఇది దొరికింది. ఈ వీడియోలో విజయ్ వర్మ వైట్ షర్ట్ లో ఉండగా, తమన్నా పింక్ డ్రెస్ లో కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. గోవాలో జరిగిన న్యూ ఇయర్ పార్టీలో ఓ కార్నర్‌లో వీరిద్దరూ కౌగిలించుకుని ముద్దులు పెట్టుకోవడం వీడియోలో కనిపిస్తోంది. దీంతో తమన్నా, విజయ్ వర్మ డేటింగ్‌లో ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మరి ఈ వీడియోపై తమన్నా ఎలా స్పందిస్తుందో చూడాలి.
నవీకరించబడిన తేదీ – 2023-01-02T18:08:16+05:30 IST