టాలీవుడ్ స్టార్ హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. యూత్‌లోనూ పవన్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే పవర్ స్టార్ సినిమా కోసం చాలా మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. యూత్‌లోనూ పవన్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే పవర్ స్టార్ సినిమా కోసం చాలా మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ ప్రస్తుతం ‘హరి హర వీర మల్లు’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 60 శాతానికి పైగా పూర్తయింది. తాజాగా ఫిల్మ్ నగర్ లో పవన్ పై ఓ రూమర్ హల్ చల్ చేస్తోంది. అంటే..
‘వినోదయ సీతమ్’ రీమేక్ విషయంలోనూ పవన్ కళ్యాణ్ ఒకే చెప్పిన సంగతి తెలిసిందే. సాయిధరమ్ తేజ్ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ అతి త్వరలో పూర్తి కానుందని తెలుస్తోంది. ఫిబ్రవరి 14న పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సమాచారం.ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన కేతికా శర్మ నటించనుందని సమాచారం. ఇప్పటికే హరీష్ శంకర్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చేయడానికి పవన్ అంగీకరించాడు. సుజిత్ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు. ఈ రెండు సినిమాలకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కొత్త మూడో చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. అయితే ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. కొత్త ప్రాజెక్ట్ తో కలిపి పవన్ కు మొత్తం నాలుగు సినిమాలు రానున్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు పూర్తవుతాయో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.
గబ్బర్ సింగ్ తర్వాత పవర్ స్టార్, హరీష్ కళ్యాణ్ మళ్లీ కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కనుంది. జపాన్, భారత్ నేపథ్యంలో కొనసాగనున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది.
నవీకరించబడిన తేదీ – 2023-02-08T20:51:46+05:30 IST