పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య తీవ్ర అస్వస్థత కారణంగా కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో చేరారు. 79 ఏళ్ల భట్టాచార్య తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, టైప్-2 రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు మెడికల్ బులెటిన్‌లో తెలిపారు.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్దదేబ్ భట్టాచార్జీ తీవ్ర అస్వస్థత కారణంగా కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో చేరారు. 79 ఏళ్ల భట్టాచార్య తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, టైప్-2 రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు శనివారం సాయంత్రం విడుదల చేసిన మెడికల్ బులెటిన్‌లో తెలిపారు. నాన్ ఇన్వేసివ్ వెంటిలేషన్ సపోర్టుతో పాటు యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. రక్త ప్రసరణ మరియు హార్డ్ రేటు స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. మెడిసిన్, క్రిటికల్ కేర్, కార్డియాలజీ, పల్మోనాలజీ, ఇంటర్నల్ మెడిసిన్ మరియు అనస్థీషియాలజీలో నిపుణులైన తొమ్మిది మంది వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స అందించబడుతుంది.
భట్టాచార్య గత కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఇంట్లో పరీక్షలు నిర్వహించిన వైద్యులు కొద్దిరోజులుగా నెబ్యులైజర్ వాడుతున్నప్పటికీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని, ఆలస్యం చేయకుండా ఆస్పత్రిలో చేర్పించాలని చెప్పడంతో కుటుంబ సభ్యులు శనివారం ఉదయం ఉడ్ ల్యాండ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం నాన్-ఇన్వాసివ్ వెంటిలేషన్ సపోర్ట్‌తో చికిత్స పొందుతున్నారు.
సీఎం ఆందోళన.. గవర్నర్ సంప్రదింపులు
భట్టాచార్య ఆరోగ్యంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గవర్నర్ ఆనంద్ బోస్ ఆసుపత్రికి వెళ్లి భట్టాచార్య కుటుంబ సభ్యులను పరామర్శించారు
నవీకరించబడిన తేదీ – 2023-07-29T19:45:55+05:30 IST