సీనియర్ నటి జయలలిత ‘రుద్రంకోట’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎఆర్‌కె విజువల్స్ బ్యానర్‌పై రాము కోన దర్శకత్వంలో అనిల్ అర్క కందవల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్, విభీష, రియా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆగస్ట్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
రుద్రం కోట మూవీ స్టిల్స్
సీనియర్ నటి జయలలిత (జయలలిత) ‘రుద్రం కోట’ (రుద్రం కోట) చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎఆర్‌కె విజువల్స్ బ్యానర్‌పై రాము కోన దర్శకత్వంలో అనిల్ అర్క కందవల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్, విభీష, రియా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టు నెలలో స్క్రీన్ మ్యాక్స్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ రీసెంట్ గా వెల్లడించారు.
ఈ సందర్భంగా హీరో, నిర్మాత అనిల్ అర్క కందవల్లి మాట్లాడుతూ. భద్రాచలం సమీపంలోని రుద్రంకోట అనే గ్రామం నేపథ్యంలో కథ సాగుతుంది. ఇప్పటి వరకు ఎవరూ చూపించని వాటిని మా సినిమాలో చూపిస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఇందులో ఉన్నాయి. సీనియర్ నటి జయలలిత ఈ చిత్రంలో సమర్పకురాలిగా కీలక పాత్ర పోషించారు. (రుద్రం కోట విడుదల వివరాలు)
ప్రముఖ సంగీత దర్శకులు కోటిగారు మా చిత్రానికి అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యుబిఎ సర్టిఫికేట్‌తో సినిమా బాగుందని సెన్సార్ ప్రముఖులు ప్రశంసించారు. మా సినిమా నచ్చడంతో స్క్రీన్ మ్యాక్స్ గ్రాండ్ గా రిలీజ్ చేయాలని నిర్ణయించింది. ఆగస్ట్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు.
****************************************
****************************************
****************************************
****************************************
****************************************
నవీకరించబడిన తేదీ – 2023-07-26T20:39:44+05:30 IST