విహారి 16 టెస్టుల్లో 28 ఇన్నింగ్స్‌లు ఆడి 839 పరుగులు చేశాడు. గతేడాది ఆస్ట్రేలియా టూర్ లో రాణించి అందరి మన్ననలు అందుకున్నాడు. వెస్టిండీస్ పర్యటనకు సెలక్టర్లు తనను ఎంపిక చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

టీమిండియా టెస్ట్ టీమ్ ప్లేయర్, తెలుగు తేజం హనుమ విహారి కీలక వ్యాఖ్యలు చేశారు. వెస్టిండీస్ పర్యటనకు సెలక్టర్లు తనను ఎంపిక చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హనుమ విహారి మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను జట్టు నుంచి ఎందుకు తప్పించారో అర్థం కావడం లేదన్నారు.
గతేడాది జులైలో ఇంగ్లండ్ గడ్డపై టెస్టు ఆడిన తర్వాత సెలక్టర్లు విహారిని పట్టించుకోవడం లేదు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. విహారి 16 టెస్టుల్లో 28 ఇన్నింగ్స్‌లు ఆడి 839 పరుగులు చేశాడు. గతేడాది ఆస్ట్రేలియా టూర్ లో రాణించి అందరి మన్ననలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో విహారి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అవకాశం దొరికిన ప్రతిసారీ జట్టు విజయం కోసం కృషి చేశానని విహారి తెలిపాడు. తనను జట్టు నుంచి ఎందుకు తొలగించారో ఎవరూ చెప్పలేదని అన్నాడు. అయితే తాను ఆ అంశం గురించి ఆందోళన చెందడం లేదని, ప్రస్తుతం తన ఆటను మెరుగుపరుచుకోవడంపైనే దృష్టి పెట్టానని చెప్పాడు. రహానెలా సత్తా చాటి మళ్లీ జట్టులోకి రావడమే తన ప్రధాన లక్ష్యమని విహారి తెలిపాడు.
ఇది కూడా చదవండి: IND vs WI 1వ టెస్టు: బ్యాడ్ న్యూస్.. తొలి రోజు ఆటకు వర్షం ఆటంకం?
టెస్టుల్లోనే కాకుండా అన్ని ఫార్మాట్లలో ఆడాలని కోరుకుంటున్నట్లు విహారి తెలిపాడు. ఐపీఎల్‌లోనూ ఆడే సత్తా తనకు ఉందని చెప్పాడు. చాలా మందికి తాను నెమ్మదిగా ఆడతాడనే అపోహ ఉందని విహారి అభిప్రాయపడ్డాడు. టెస్టు క్రికెట్ చాలా భిన్నమైనదని, పరిస్థితులకు అనుగుణంగా ఆడాలని సూచించాడు. తన వయసు 29 ఏళ్లేనని, అయితే 35 ఏళ్ల వయసులో కూడా రహానే రాణిస్తున్నాడని గుర్తు చేసిన విహారి.. దులీప్ ట్రోఫీ ఫైనల్లో గట్టిగా ఆడాల్సి రావడం వల్లే వేగంగా బ్యాటింగ్ చేశానని వివరించాడు. మరోవైపు జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన హనుమ విహారి ఇటీవల ఐపీఎల్‌లో జియో సినిమాలో వ్యాఖ్యాతగా కనిపించి క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాడు. అతను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనప్పటికీ, విహారి ప్రయాణ వ్యాఖ్యాతగా కనిపించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
నవీకరించబడిన తేదీ – 2023-07-12T14:54:10+05:30 IST