IND vs WI 2nd: రోహిత్-కోహ్లీల రికార్డుకు మరో 2 పరుగులు

బార్బడోస్: టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ చారిత్రక రికార్డుకు 2 అడుగుల దూరంలో ఉన్నారు. రోహిత్-కోహ్లీ కలిసి మరో 2 పరుగులు చేస్తే, వారి వన్డే కెరీర్‌లో 5000 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేస్తారు. దీంతో వన్డేల్లో 5000 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసిన జోడీగా రికార్డు సృష్టించనున్నారు. వెస్టిండీస్‌తో జరిగే రెండో వన్డేలో ఈ రికార్డును అందుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వన్డే ఫార్మాట్‌లో రోహిత్-కోహ్లీ కలిసి 4,998 పరుగులు చేశారు. ఈ క్రమంలో భారత్ తరఫున 5000 పరుగులు పూర్తి చేసిన మూడో జోడీగా రోహిత్-కోహ్లీ నిలిచారు. అత్యంత వేగంగా ఈ గౌరవాన్ని అందుకున్న జంటగా వీరు రికార్డు సృష్టించనున్నారు. సచిన్-గంగూలీ (8227), రోహిత్ శర్మ-శిఖర్ ధావన్ (5,170) అగ్రస్థానంలో ఉన్నారు. అయితే ఓపెనింగ్‌లో కాకుండా వన్‌డౌన్‌లో ఈ రికార్డు నెలకొల్పిన తొలి భారత జోడీగా రోహిత్-కోహ్లీ నిలవనున్నారు. ఓవరాల్‌గా ఈ జాబితాలో రోహిత్-కోహ్లీ 8వ స్థానంలో ఉన్నారు.

ఇదే సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వ్యక్తిగత రికార్డులు సాధించే అవకాశాలున్నాయి. రోహిత్ శర్మ మరో 116 పరుగులు చేస్తే వెస్టిండీస్‌పై 3000 పరుగులు పూర్తి చేస్తాడు. అలాగే 163 పరుగులు చేస్తే వన్డేల్లో 10,000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఇక విరాట్ కోహ్లీ మరో 102 పరుగులు చేయడం ద్వారా వన్డేల్లో 13 వేల పరుగులు పూర్తి చేస్తాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మరో 6 వికెట్లు తీస్తే వన్డేల్లో 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే మరికాసేపట్లో ప్రారంభం కానుంది.

జట్లు (అంచనా)

భారతదేశం:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, కోహ్లి, ఇషాన్ కిషన్, హార్దిక్, సూర్యకుమార్, జడేజా, శార్దూల్, కుల్దీప్, ఉమ్రాన్, ముఖేష్.

వెస్ట్ ఇండీస్:

బ్రాండన్ కింగ్, అతానాజ్, హోప్ (కెప్టెన్), కార్తీ, హెట్మెయర్, పావెల్, షెపర్డ్, డ్రేక్స్, కరియా, మోతీ, సీల్స్.

నవీకరించబడిన తేదీ – 2023-07-29T17:26:15+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *