జులై 18న ఎన్డీయే కీలక సమావేశం జరగనుంది.ఈ సమావేశానికి ఏపీ నుంచి టీడీపీ హాజరవుతోంది. ఇప్పుడు జాతీయ మీడియాతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఛానెల్స్‌లో ఈ వార్త ప్రధాన వార్తగా మారింది. గతంలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ రెండు పార్టీల మధ్య పెద్దగా సంబంధాలు లేవు.
జులై 18న ఎన్డీయే కీలక సమావేశం జరగనుంది.ఈ సమావేశానికి ఏపీ నుంచి టీడీపీ హాజరవుతోంది. ఇప్పుడు జాతీయ మీడియాతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఛానెల్స్‌లో ఈ వార్త ప్రధాన వార్తగా మారింది. గతంలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత రెండు పార్టీల మధ్య సత్సంబంధాలు లేవు. అయితే ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయన్న వార్తలతో అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలకు పదును పెట్టాయి. సరిగ్గా ఇదే సమయంలో ఎన్డీయే సమావేశం జరగడం.. ఈ సమావేశానికి టీడీపీ హాజరవుతుండడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఈ అంశంపై చర్చ జరుగుతోంది. అయితే ఈ భేటీ తర్వాత ఎన్డీయేలో చేరే విషయమై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాబు కీలక ప్రకటన చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిన్న మొన్నటి వరకు వైసీపీ బీజేపీతో అంటకాగుతోంది. అయితే ఇప్పుడు ఒక్కసారిగా ఎన్డీయే సమావేశానికి టీడీపీ వెళ్లడంతో హాట్ టాపిక్ గా మారింది.
వ్యూహాత్మకంగా అడుగు!
మరోవైపు ఎల్జేపీ, అకాలీదళ్ తదితర పార్టీలు కూడా ఎన్డీయే సమావేశానికి హాజరు కానున్నాయి. మరోవైపు, ఎన్డీయేలోని ప్రస్తుత భాగస్వామ్య పక్షాలతో పాటు కూటమిలో చేరే వారితో పాటు సమావేశానికి హాజరు కావాలని బీజేపీ అగ్ర నాయకత్వం నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. ఈ క్రమంలో టీడీపీ, శిరోమణి అకాలీదళ్, లోక్ జనశక్తి(పాశ్వాన్) పార్టీలతో పాటు మరికొన్ని పార్టీలకు ఆహ్వానం అందినట్లు జాతీయ మీడియాలో ప్రత్యేక కథనాలు వెలువడుతున్నాయి. ఈ కీలక సమావేశం 18న ఢిల్లీలోని అశోకా హోటల్‌లో జరగనుంది. లోక్‌సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ అగ్రనేతలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. అందుకే.. కేంద్ర, రాష్ట్ర పార్టీలో మార్పులు, చేర్పులు చేసి, ఎన్డీయే విస్తరణకు కసరత్తు పూర్తి చేసి, ఈ సభను నిర్వహించి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పెద్దలు కార్యాచరణ చేపట్టారు. ఇప్పటికే పలు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను మార్చిన బీజేపీ నేతలు.. రెండు మూడు రోజుల్లో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు. కీలకమైన ఈ భేటీలోపు మార్పులు, చేర్పులు జరగాలని.. వీలైతే ఒకటి రెండు కొత్త పార్టీలు ఎన్డీయేలో చేరే అవకాశాలు కూడా కేంద్ర కేబినెట్ లో చోటు చేసుకున్నాయి.
మొత్తం.. విపక్షాలు కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించగానే ఎన్డీయే పార్టీలను ఆహ్వానించి మరోసారి సమావేశం నిర్వహించడం పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఈ సమావేశానికి ఎన్ని పార్టీలు హాజరవుతాయో..? మరి బీజేపీ అగ్రనాయకత్వం ఎవరితో సంప్రదింపులు జరుపుతోంది..? మరి ఫైనల్‌లో ఏం జరుగుతుందో తెలియాలంటే 18వ తేదీ వరకు ఆగాల్సిందే.
నవీకరించబడిన తేదీ – 2023-07-06T18:25:06+05:30 IST