కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఈ ఏడాది జనవరి 17న హీరో ధనుష్‌తో విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఈ ఏడాది జనవరి 17న హీరో ధనుష్‌తో విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. 18 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు ఇద్దరూ వేర్వేరుగా సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు ఐశ్వర్య తండ్రి రజనీకాంత్, ధనుష్ తండ్రి కస్తూరి రాజా తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఇద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. అయితే వీరిద్దరూ మళ్లీ కలవబోతున్నారనే వార్త కోలీవుడ్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
ధనుష్, ఐశ్వర్య తొమ్మిది నెలలుగా విడివిడిగా జీవిస్తున్నారు. గతంలో ఓ పార్టీలో కలిసినప్పుడు కూడా పలకరించుకోలేదని వార్తలు వచ్చాయి. ఈ దంపతులకు యాత్ర, లింగ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. విడాకుల ప్రకటన తర్వాత వీరిద్దరూ జంటగా ఎక్కడా కనిపించలేదు. కానీ, కొద్దిరోజుల క్రితం వీరిద్దరూ యాత్ర స్కూల్ ఈవెంట్‌లో జంటగా కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ధనుష్ మరియు ఐశ్వర్య మళ్లీ కలవబోతున్నారని పుకార్లు మొదలయ్యాయి. దానికి బలం చేకూర్చేలా కోలీవుడ్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేయడం ప్రారంభించింది. ధనుష్, ఐశ్వర్యలు రజనీకాంత్ నివాసంలో కలుసుకున్నారు. ప్రస్తుతానికి కోర్టులో విడాకుల పిటిషన్ వేయకూడదని నిర్ణయించుకున్నారు. విభేదాలను పరిష్కరించుకుని మరోసారి కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ వార్త విన్న ధనుష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు, ధనుష్ తండ్రి కస్తూరి రాజా దంపతులు తమ విభేదాలను పరిష్కరించుకుని త్వరలో కలిసిపోతారని వెల్లడించారు. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం మామూలే.. వారి మధ్య ఇలాంటి గొడవలు జరిగేవి.. వారితో ఫోన్‌లో మాట్లాడాను.. కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చాను.. విడాకుల నిర్ణయంపై పునరాలోచించుకోవాలని రజనీకాంత్ వారిద్దరినీ కోరారు.. ధనుష్ తండ్రి కస్తూరి రాజా పిల్లల భవిష్యత్తు దృష్ట్యా విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కోరుతున్నారు.
నవీకరించబడిన తేదీ – 2022-10-05T23:09:52+05:30 IST