గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ డిప్లొమా ప్రోగ్రామ్స్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. వ్యవసాయం, విత్తన సాంకేతికత, సేంద్రియ వ్యవసాయం విభాగాల్లో ఈ కార్యక్రమం వ్యవధి రెండేళ్లు. డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ వ్యవధి మూడేళ్లు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లతో పాటు అనుబంధ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. బోధన ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది.
డిప్లొమాలు-సీట్లు
-
డిప్లొమా ఇన్ అగ్రికల్చర్- ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 578 సీట్లు, అనుబంధ కళాశాలల్లో 2060 సీట్లు ఉన్నాయి.
-
డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ- ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 25 సీట్లు, అనుబంధ కళాశాలల్లో 340 సీట్లు ఉన్నాయి.
-
డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్- ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 25 సీట్లు, అనుబంధ కళాశాలల్లో 40 సీట్లు ఉన్నాయి.
-
డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్- ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 60 సీట్లు, అనుబంధ కళాశాలల్లో 330 సీట్లు ఉన్నాయి.
-
కనీసం నాలుగేళ్లు గ్రామీణ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 75 శాతం సీట్లు, పట్టణ ప్రాంతాల్లో చదివిన వారికి 25 శాతం సీట్లు కేటాయించారు.
అర్హత వివరాలు: ఆంధ్రప్రదేశ్/తెలంగాణ స్టేట్ బోర్డ్ లేదా CBSE/ICSE/NIOS/APOSS/TOOSS నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతి కంపార్ట్‌మెంటల్ అభ్యర్థులు; ఇంటర్ ఫెయిల్/డ్రాప్ అవుట్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ ఉత్తీర్ణులు/ పోస్ట్ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు. అభ్యర్థుల వయస్సు ఆగస్టు 31 నాటికి 15 నుండి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము: సాధారణ అభ్యర్థులకు రూ.800; వికలాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.400
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్ 14 నుండి
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 30
మొదటి దశ ఆన్‌లైన్ కౌన్సెలింగ్: జూలై 17
రెండవ దశ ఆన్‌లైన్ కౌన్సెలింగ్: జూలై 27
వెబ్‌సైట్: angrau.ac.in
నవీకరించబడిన తేదీ – 2023-06-10T13:06:00+05:30 IST