మందులు: చుక్కల్లో మందుల ధరలు! 12 శాతం పెంపు.. 1 నుంచి అమలు

800కి పైగా మందుల ధరలపై ప్రభావం

విదేశీ ముడిసరుకు ధరల పెంపుతో?

18 ఫార్మా కంపెనీల లైసెన్సుల రద్దు

నకిలీ మందుల తయారీయే కారణం

‘సెలాన్’ క్యాన్సర్ మందులో హానికరమైన బ్యాక్టీరియా

హైదరాబాద్ కంపెనీ ఉత్పత్తిని నిలిపివేయాలని ఆదేశం

న్యూఢిల్లీ, మార్చి 28: నిత్యావసర మందుల ధరలు 12 శాతం పెరగనున్నాయి. ఈ పెంపు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది.జ్వరాలు, ఇన్‌ఫెక్షన్లు, గుండె జబ్బులు, బీపీ, చర్మవ్యాధులు, రక్తహీనత తదితర వ్యాధుల చికిత్సలో వాడే మందులతోపాటు పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ ధరలు పెరగనున్నాయి. తాజా పెంపు జాతీయ నిత్యావసర ఔషధాల జాబితాలోని 800కు పైగా మందులపై ప్రభావం చూపనుంది. 27 చికిత్సల కోసం దాదాపు 900 మిశ్రమాలలో ఉపయోగించే 384 పదార్థాల ధరలను 12 శాతం పెంచినట్లు ఒక ఆంగ్ల పత్రిక ప్రచురించింది. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ముడిసరుకులే ధరలు పెరగడానికి ప్రధాన కారణమని భిలాయ్‌కు చెందిన కెమిస్ట్ రాజేష్ గౌర్ తెలిపారు. మందులు, ఎపిఐ (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్)లో వాడే ముడిసరుకు ధరలు పెరిగాయని, దీంతో పాటు రవాణా, ప్యాకింగ్ ఖర్చులు కూడా పెరిగాయన్నారు. ఫలితంగా ఔషధాల గరిష్ట విక్రయ ధర (ఎంఆర్‌పీ) 12 శాతం పెరుగుతుందని చెప్పారు.

18 ఫార్మా కంపెనీల లైసెన్సుల రద్దు

నకిలీ మందులను తయారు చేస్తున్న 18 ఫార్మాస్యూటికల్ కంపెనీల లైసెన్స్‌లను కేంద్ర ప్రభుత్వం మంగళవారం రద్దు చేసింది. గతేడాది అక్టోబరు నుంచి గాంబియా, ఉజ్బెకిస్థాన్, అమెరికాలో భారత కంపెనీల నకిలీ మందులు వెలుగు చూసిన తర్వాత ప్రభుత్వం తొలిసారిగా ఈ చర్యలు చేపట్టింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లోని ఫార్మా కంపెనీల్లో తనిఖీలు నిర్వహించింది. వీటిలో ఏపీ, తెలంగాణ, బీహార్, ఢిల్లీ, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని 70, ఉత్తరాఖండ్‌లో 45, మధ్యప్రదేశ్‌లోని 23 కంపెనీల్లో తనిఖీలు నిర్వహించినట్లు ఓ ఆంగ్ల వార్తా సంస్థ వెల్లడించింది. తొలి దశలో 76 కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకుందని, అందులో 18 కంపెనీల లైసెన్సులు రద్దు చేసినట్లు ఓ అధికారి తెలిపారు.

నవీకరించబడిన తేదీ – 2023-03-29T12:26:02+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *