హర్యానాలోని పలు జిల్లాల్లో జరిగిన హింసాకాండ తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం అల్లార్డ్ ప్రకటించారు. పొరుగు రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్తతలు ఢిల్లీపై ప్రభావం చూపకుండా అధికారులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పోలీసు సిబ్బంది సెలవులను రద్దు చేశారు. అల్లర్లు జరిగే సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.
న్యూఢిల్లీ: హర్యానాలోని పలు జిల్లాల్లో అకస్మాత్తుగా హింస చెలరేగడంతో మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో అలర్ట్ ప్రకటించారు. పొరుగు రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ ప్రభావం ఢిల్లీపై పడకుండా అధికారులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పోలీసు సిబ్బంది సెలవులను రద్దు చేశారు. అల్లర్లు జరిగే సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.
హర్యానా ప్రభుత్వం కేంద్ర సహాయాన్ని కోరింది
హర్యానాలోని నుహ్ జిల్లాలో ఓ వర్గం ఊరేగింపు నిర్వహిస్తుండగా.. మరో వర్గం దాడి చేయడంతో ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు పోలీసులు, ముగ్గురు పౌరులు ఉన్నారు. అల్లర్లను నియంత్రించి శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు సహకరించాలని హర్యానా ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని అదనపు ప్రధాన కార్యదర్శి (హోం) టీవీఎస్‌ఎన్ ప్రసాద్ తెలిపారు. వారం రోజుల పాటు కేంద్రం నుంచి 20 కంపెనీలతో కూడిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను పంపాలని కోరామన్నారు. నుహ్ జిల్లాలో పరిస్థితిని అదుపు చేసేందుకు కర్ఫ్యూ విధించారు. కాగా, అల్లర్ల వెనుక కుట్ర దాగి ఉందని, ఊరేగింపును అడ్డుకుని దాడికి ఓ వర్గం ప్లాన్ చేసిందని సీఎం మనోహర్ లాల్ కట్టర్ అనుమానం వ్యక్తం చేశారు. అల్లర్లకు పాల్పడిన నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు ఎలాంటి ఉద్రిక్తతలకు గురికావద్దని, ప్రశాంతంగా ఉండాలని కోరారు.
నవీకరించబడిన తేదీ – 2023-08-01T20:01:09+05:30 IST