మదిలో మది: ‘మదిలో మది’.. రిలీజ్ డేట్ వెల్లడించిన ‘బేబీ’ దర్శకుడు

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-08-01T20:02:37+05:30 IST

ప్రేమకథా చిత్రాలను మాస్ ఎప్పుడూ ఇష్టపడతారని రీసెంట్ గా వచ్చిన ‘బేబీ’ సినిమా మరోసారి చాటిచెప్పింది. యూత్ ని ఆకట్టుకునే కథ, కథనాలతో సాయి రాజేష్ నటించిన ‘బేబీ’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాంటిదే మరో సినిమా ‘మదిలో మది’ అని అంటున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ని దర్శకుడు సాయి రాజేష్ చేతుల మీదుగా యూనిట్ విడుదల చేసింది.

మదిలో మది: 'మదిలో మది'.. రిలీజ్ డేట్ వెల్లడించిన 'బేబీ' దర్శకుడు

సాయి రాజేష్ తో మదిలో మది టీమ్

ప్రేమకథా చిత్రాలను మాస్ ఎప్పుడూ ఇష్టపడతారని రీసెంట్ గా వచ్చిన ‘బేబీ’ సినిమా మరోసారి చాటిచెప్పింది. యూత్ ని ఆకట్టుకునే కథ, కథనాలతో సాయి రాజేష్ ‘బేబీ’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాంటి కోవకు చెందిన మరో అందమైన ప్రేమకథగా ‘మదిలో మది’ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. జై, శీను, స్వీటీ, సిరి రావుల చారి, సునీత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మదిలో మది’. ప్రకాష్ పల్లా దర్శకత్వం వహించగా, SKLM క్రియేషన్స్‌పై నేముకూరి జయకుమార్ నిర్మించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ విడుదల చేశారు.

పోస్టర్‌ని విడుదల చేసిన అనంతరం దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ.. ఆగస్టు 18న మదిలో మది సినిమా విడుదలవుతోంది.ట్రైలర్ చూశాను. మరో గొప్ప సినిమా రాబోతుందనిపించింది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. యూనిట్‌కి ఆల్ ది బెస్ట్. ఈ చిత్రానికి సంబంధించి ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ విడుదల చేసిన టైటిల్ పోస్టర్ మరియు ‘బలగం’ చిత్ర కథానాయిక కావ్య కళ్యాణ్ రామ్ విడుదల చేసిన టైటిల్ టీజర్‌కు మంచి స్పందన లభించిందని మేకర్స్ తెలిపారు. రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన దర్శకుడు సాయిరాజేష్‌కి చిత్రయూనిట్ కృతజ్ఞతలు తెలిపారు. (మదిలో మది రిలీజ్ డేట్)

****************************************

****************************************

****************************************

****************************************

****************************************

నవీకరించబడిన తేదీ – 2023-08-01T20:02:37+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *