ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్: ‘డేంజర్ చైల్డ్’గా శ్రీలీల..టాలెంటెడ్ యాక్టర్ నితిన్, అందాల బొమ్మ శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ ‘ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్’. ఈ చిత్రానికి రచయిత-దర్శకుడు వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రేష్ఠ మూవీస్, ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్, రుచిరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తయింది. బుధవారం ఈ చిత్రంలోని ‘డేంజర్ పిల్లా..’ అనే లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

‘డేంజర్ బాయ్.. డేంజర్ బాయ్..’ అంటూ మన హీరో నితిన్ తనకు నచ్చిన అమ్మాయిపై ఓ పాట పాడాడు.. తన మనసును ఇంతలా దోచుకున్న అమ్మాయి ఎవరో తెలుసా.. శ్రీలీల. ఓ వైపు తన ప్రియతమ అందాన్ని పొగుడుతూనే.. ఆమె ప్రమాదకరమైన చిన్నారి అని తియ్యగా ఆటపట్టించాడు. వీరి మధ్య అసలు కథ ఏంటో తెలియాలంటే ‘ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్‌’ సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. ఎన్నో బ్లాక్ బస్టర్ సాంగ్స్ తో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన సంగీత మేధావి హారిస్ జైరాజ్ మరోసారి తనదైన స్టైల్ లో ‘డేంజర్ పిల్లా..’ పాటకు అద్బుతమైన ఫుట్ ట్యాపింగ్ బీట్ ఇచ్చారు. కృష్ణకాంత్ రాసిన ఈ పాటను అర్మాన్ మాలిక్ పాడారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ. లేదంటే ఈ సినిమా డిసెంబర్ 23న విడుదల కానుంది.

ఈ సినిమాలో నితిన్ ఇప్పటి వరకు చేయని పాత్రలో మెప్పించబోతున్నాడని, తప్పకుండా నితిన్ అద్భుత నటనకు అభిమానులే కాకుండా ప్రేక్షకులు కూడా ఫిదా అవుతారు. క్యారెక్టర్ బేస్డ్ స్క్రిప్ట్ తో.. కిక్ తర్వాత ఈ సినిమా ఆ రేంజ్ జోన్ లో తెరకెక్కబోతోంది. రోలర్ కోస్టర్ లాంటి అనుభూతిని అందిస్తూ ప్రేక్షకులను సర్ ప్రైజ్ లతో ఆహ్లాదపరిచే చిత్రమిది’’ అని దర్శకుడు వక్కంతం వంశీ అన్నారు.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *