ప్రముఖ దర్శకుడు ఎస్.శంకర్ కుమార్తెగా సినిమాల్లోకి వచ్చిన అదితి శంకర్.. ఇప్పుడు వెండితెరపై తన ప్రతిభతో రాణిస్తూ వరుస అవకాశాలను అందుకుంటున్నది. అంతేకాదు ఇప్పటి వరకు ఆమె నటించిన చిత్రాలన్నీ విజయం సాధించడంతో దర్శక, నిర్మాతలు అవకాశాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు 7జీ రెయిన్‌బో కాలనీ సీక్వెల్‌లో ఛాన్స్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి.
అదితి శంకర్
ప్రముఖ దర్శకుడు ఎస్.శంకర్ కుమార్తెగా సినిమాల్లోకి వచ్చిన అదితి శంకర్.. ఇప్పుడు వెండితెరపై తన ప్రతిభతో రాణిస్తూ వరుస అవకాశాలను అందుకుంటున్నది. అంతేకాదు ఇప్పటి వరకు ఆమె నటించిన చిత్రాలన్నీ విజయం సాధించడంతో దర్శక, నిర్మాతలు అవకాశాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో వారికి మరో అవకాశం దక్కింది. గతంలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా ‘7జి రెయిన్‌బో కాలనీ’ అనే సినిమా వచ్చింది. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చగా, AM రత్నం నిర్మించారు. మొదటి భాగం విడుదలై రెండు దశాబ్దాలు కావస్తోంది. ఇప్పుడు ఈ చిత్రానికి రెండో భాగం రానుంది.
సోనియా అగర్వాల్ కాకుండా రవికృష్ణ హీరోగా, అదితి శంకర్‌తో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన సెల్వరాఘవన్ రెండో భాగానికి కూడా దర్శకత్వం వహించనున్నాడు. దీని కోసం చర్చలు జరుగుతున్నాయని కోలీవుడ్ వర్గాల సమాచారం. సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘7జి రెయిన్ బో కాలనీ’ చిత్రం తెలుగులో ‘7జి బృందావన్ కాలనీ’గా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు చేయబోయే సినిమాని కూడా రెండు భాషల్లో రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అప్పట్లో ఈ సినిమా కుర్రాళ్లకు బాగా నచ్చింది. ఇప్పుడు రాబోయే సీక్వెల్ ప్రకటన కూడా రాలేదు.. అప్పుడే ఈ సినిమా గురించిన ఓ వార్త వైరల్ అవుతోంది.. అందులోని కంటెంట్ అలాంటిది.
*******************************************
****************************************
****************************************
*******************************************
*******************************************
*******************************************
నవీకరించబడిన తేదీ – 2023-08-03T23:22:47+05:30 IST