రైళ్లు రద్దు: సూళ్లూరుపేట వైపు వెళ్లే పలు రైళ్లను రద్దు చేశారు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): మనుబోలు – గూడూరు మధ్య రైల్వే లైన్ మరమ్మతుల కారణంగా ఆ దిశగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. రద్దయిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి…

– ఈ నెల 10, 11, 14, 15 తేదీల్లో ఉదయం 4.45 గంటలకు బయలుదేరాల్సిన బిట్రగుంట – చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (17237), సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరాల్సిన చెన్నై సెంట్రల్ – బిట్రగుంట ఎక్స్‌ప్రెస్ (17238) రద్దు చేయబడ్డాయి.

– ఈ నెల 10, 14 తేదీల్లో ఉదయం 7.25 గంటలకు బయలుదేరాల్సిన చెన్నై సెంట్రల్-విజయవాడ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (12077), మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరాల్సిన విజయవాడ-చెన్నై సెంట్రల్ (12078) రద్దు చేయబడ్డాయి.

– ఈ నెల 10, 15 తేదీల్లో ఉదయం 6.10 గంటలకు బయలుదేరాల్సిన విజయవాడ – చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్‌ప్రెస్ (12711), మధ్యాహ్నం 2.10 గంటలకు బయలుదేరాల్సిన చెన్నై సెంట్రల్ – విజయవాడ పినాకిని ఎక్స్‌ప్రెస్ (12712)లను రద్దు చేశారు.

– ఈ నెల 13న ఉదయం 5.30 గంటలకు బయలుదేరాల్సిన గయా – ఎగ్మూర్ ఎక్స్‌ప్రెస్ (12389), ఈ నెల 15న ఉదయం 9.15 గంటలకు బయలుదేరాల్సిన ఎగ్మూర్ – గయా ఎక్స్‌ప్రెస్ (12390) రద్దు చేయబడ్డాయి.

– ఈ నెల 12న మధ్యాహ్నం 12.15 గంటలకు బయలుదేరాల్సిన విల్లుపురం – పురూలియా బైవీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22606), ఈ నెల 14న ఉదయం 10 గంటలకు బయలుదేరాల్సిన పురూలియా – విల్లుపురం బైవీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22605) రద్దు చేయబడ్డాయి.

– ఈ నెల 14న సాయంత్రం 5.20 గంటలకు బయలుదేరాల్సిన ఎర్నాకులం – పాట్నా బైవీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22643), ఈ నెల 17న మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరాల్సిన పాట్నా – ఎర్నాకులం బైవీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22644) రద్దు చేయబడ్డాయి.

– విశాఖపట్నం – చెన్నై సెంట్రల్‌ వీక్లీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (22869) ఈ నెల 14వ తేదీ రాత్రి 7 గంటలకు, చెన్నై సెంట్రల్‌ – విశాఖపట్నం వీక్లీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (22870) ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటలకు బయల్దేరాల్సి ఉంది.

నవీకరించబడిన తేదీ – 2023-08-05T07:20:56+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *