నాగబాబు : రజనీకాంత్ జైలర్ సినిమాలో మెగా బ్రదర్ స్పెషల్ ఎట్రాక్షన్..

నాగబాబు : రజనీకాంత్ జైలర్ సినిమాలో మెగా బ్రదర్ స్పెషల్ ఎట్రాక్షన్..

జైలర్ సినిమాలో శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, మోహన్ లాల్, సునీల్… మెగా బ్రదర్ నాగబాబు కూడా గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు.

నాగబాబు : రజనీకాంత్ జైలర్ సినిమాలో మెగా బ్రదర్ స్పెషల్ ఎట్రాక్షన్..

రజనీకాంత్ జైలర్ సినిమాలో నాగబాబు గెస్ట్ అప్పియరెన్స్

నాగబాబు: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జైలర్’. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది మరియు ఆగస్ట్ 10న విడుదలైంది. ఈ చిత్రంలో తమన్నా, కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, సునీల్… వంటి స్టార్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తమిళనాడు, కేరళలో ఇప్పటికే చాలా చోట్ల జైలర్ ఎర్లీ మార్నింగ్ షోలు జరిగాయి. అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. జైలర్ సినిమా చూసిన వారంతా సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో శివరాజ్ కుమార్, జాకీష్రాఫ్, మోహన్ లాల్, సునీల్.. మెగా బ్రదర్ నాగబాబు కూడా గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుండగా నాగబాబు స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

జైలర్ ట్విట్టర్ రివ్యూ : జైలర్ ట్విట్టర్ రివ్యూ.. ఫ్యామిలీ మ్యాన్ యాక్షన్ లోకి దిగితే..

జైలర్ సినిమా షూటింగ్‌లో రజనీకాంత్‌తో కలిసి ఉన్న ఫోటోతో పాటు జైలర్ పోస్టర్లను వీడియో రూపంలో తన వాయిస్ ఓవర్‌తో పోస్ట్ చేశాడు. తాను చిన్నప్పటి నుంచి రజనీకాంత్‌కి వీరాభిమానినని, ఇప్పుడు రజనీకాంత్‌తో ఓ సన్నివేశంలో కనిపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. జైలర్ పెద్ద హిట్ కావాలి. దీంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *