భోలా శంకర్ రివ్యూ
ప్రధాన తారాగణం: చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నా, సుశాంత్
దర్శకుడు: మెహర్ రమేష్
సంగీతం: మహతి స్వర సాగర్
నిర్మాత: అనిల్ సుంకర
తెలుగుమిర్చి రేటింగ్ : 2.25/5
మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భోళా శంకర్. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. తమిళ హిట్ మూవీ వేదాళంకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి మెహర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి భోళా శంకర్‌తో చిరంజీవి ప్రేక్షకులను మెప్పించగలిగాడా లేదా అనేది రివ్యూలో చూద్దాం.
శంకర్ (చిరంజీవి) తన సోదరి మహాలక్ష్మి (కీర్తి సురేష్)తో కలిసి కోల్‌కతా వస్తాడు. బతుకుదెరువు కోసం టాక్సీ నడుపుతుంటాడు. ఒక రోజు అతను కారు కోసం ఎదురు చూస్తున్న లాస్య (తమన్నా)ని కోర్ట్‌కి దింపాడు, అప్పుడు అనుకోని పరిస్థితిలో లాస్య తమ్ముడు శ్రీకర్ (సుశాంత్) మహాలక్ష్మిని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. అయితే నగరంలో ఓ మాఫియా ముఠా అమ్మాయిలను కిడ్నాప్ చేసి విక్రయిస్తూనే ఉంటుంది. పోలీసులు వారిని పట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో శంకర్ (చిరంజీవి) మాఫియాను టార్గెట్ చేస్తాడు. అసలు ఆ మాఫియాని శంకర్ ఎందుకు టార్గెట్ చేసాడు?, ఆ మాఫియాతో శంకర్‌కి గతంలో ఉన్న సంబంధం ఏమిటి?, మధ్యలో లాయర్ లాస్య(తమన్నా)తో శంకర్ ట్రాక్ ఏంటి?, చివరికి శంకర్ ఆ మాఫియాని అంతం చేశాడా?, లేదా ? అన్నది మిగతా కథ.
తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం సబ్జెక్ట్ తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి ఈ సినిమా తీశానని దర్శకుడు రమేష్ మొదటి నుంచి చెబుతున్నాడు. నిజానికి వేదాళం సినిమా నుంచి అక్రమ యువతుల అక్రమ రవాణా అంశాన్ని తీసుకుని తెలుగు నేటివిటీకి తగిన మార్పులు చేర్పులు చేసిన మాట నిజం. కానీ తెలుగు ప్రేక్షకుల అభిరుచిని పూర్తిగా పక్కనపెట్టి మెగాస్టార్ చిరంజీవిని ఎలా ట్రీట్ చేయాలనుకుంటున్నాడో అదే విధంగా తెరపై తనని తాను ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నించినట్లు కనిపించింది. చిరు రఫ్, మాస్ అవతార్ చిత్రాల్లో మెగాస్టార్ అద్భుతంగా నటించారు. ఇక కీర్తి సురేష్ చెల్లి పాత్రకు ప్రాణం పోసింది. సుశాంత్ మరో క్యామియో క్యారెక్టర్‌లో కూడా బాగా నటించాడు. తమన్నా గ్లామర్ ఆకట్టుకుంది. లీడ్ రోల్ లో మురళీ శర్మ పెర్ఫార్మెన్స్ చాలా సెటిల్డ్ గా ఉంది. శ్రీముఖిది చెప్పుకోదగ్గ పాత్ర. అందంతో పాటు నటన కూడా ఆకట్టుకుంది. రఘుబాబు, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
ఫైనల్‌లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు