కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. దక్షిణ తెలంగాణలో కమ్యూనిస్టులకు ఒక్కో నియోజకవర్గంలో కనీసం ఐదు వేల ఓట్లు, బలమైన నియోజకవర్గాల్లో పది వేల ఓట్లు ఉంటాయి. వచ్చే ఎన్నికల్లో ఇవి కీలకంగా మారే అవకాశం ఉంది. టఫ్ ఫైట్ తప్పదని రిపోర్టులు వస్తుండటంతో…కమ్యూనిస్టులకు కొన్ని సీట్లు ఇచ్చినా పొత్తులు పెట్టుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
సీపీఐ, సీపీఎం పార్టీలకు నమ్మకమైన ఓటు బ్యాంకు ఉంది. ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధినేత అంచనా వేస్తున్నారు. ఈసారి కూడా కనీసం మెజారిటీ సీట్లు సాధించాలని ప్రయత్నిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో గత రెండు ఎన్నికల్లో ఒక్క సీటుకు మించి రాలేదు. ఒక్కో నియోజకవర్గంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు కనీసం 5 వేల ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లు గెలుపును సులభతరం చేస్తాయని భావిస్తున్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు. ఆ నియోజకవర్గంలో ఆ పార్టీకి గట్టి ఓటు బ్యాంకు ఉన్నందున బీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధించింది. అయితే ఆ తర్వాత కేసీఆర్ కమ్యూనిస్టులతో సంప్రదింపులు ఆపేశారు. ఈ విషయంపై కమ్యూనిస్టు పార్టీ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ కేసీఆర్ మనసు మార్చుకుని కమ్యూనిస్టులతో పొత్తులకు సిద్ధమవుతున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఒప్పుకోకుంటే.. కాంగ్రెస్ తో వెళ్తారని.. బీఆర్ ఎస్ కు మరింత నష్టం వాటిల్లుతుందని భావిస్తున్నారు.
సీపీఐ, సీపీఎం చెరో మూడు సీట్లు అడుగుతున్నాయి. అయితే ఆయా పార్టీల అగ్రనేతలకు ఒక్కొక్కరికి రెండు సీట్లు ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.