హైదరాబాద్‌లో జరిగిన ‘కింగ్ ఆఫ్ కొత్త’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో రానా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే! మంగళవారం దుల్కర్, సోనమ్ కపూర్‌లకు రానా ట్విట్టర్‌లో క్షమాపణలు చెప్పాడు. వాళ్లంటే నాకు చాలా గౌరవం’ అని అన్నారు.

హైదరాబాద్‌లో జరిగిన ‘కింగ్ ఆఫ్ కొత్త’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో రానా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే! మంగళవారం నాడు రానా దగ్గుబాటి ట్విట్టర్‌లో దుల్కర్ సల్మాన్, సోనమ్ కపూర్‌లకు క్షమాపణలు చెప్పారు. వాళ్లంటే నాకు చాలా గౌరవం’ అని అన్నారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. అసలు మ్యాటర్‌లోకి వెళితే.. దుల్కర్ సల్మాన్ హీరోగా అభిలాష్ జోషిలీ తెరకెక్కించిన చిత్రం ‘కింగ్ ఆఫ్ కొత్త’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రానా అతిథిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో రానా మాట్లాడుతూ.. “దుల్కర్‌కి ఓపిక ఎక్కువ. కోపం రాదు. ఒకసారి ఆయన చేస్తున్న హిందీ సినిమా షూటింగ్‌కి వెళ్లాను. అక్కడ ఓ స్టార్ హీరోయిన్ షాట్ కు రాకుండా చాలా టైమ్ వేస్ట్ చేసింది. దుల్కర్ ఎండలో ఆమె కోసం ఎదురుచూస్తుండగా, ఆమె తన భర్తతో షాపింగ్ గురించి చాలాసేపు మాట్లాడుతోంది. దాంతో నాకు కోపం వచ్చింది. నా చేతిలోని వాటర్ బాటిల్ విసిరాను. కానీ, దుల్కర్ చాలా ప్రశాంతంగా షూటింగ్ పూర్తి చేశాడు” అన్నారు.
దీంతో నెటిజన్లంతా ఆమెను హీరోయిన్ సోనమ్ కపూర్ అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ మొత్తం వ్యవహారంపై రానా తన ట్విట్టర్‌లో వివరణ ఇస్తూ వారికి క్షమాపణలు చెప్పాడు. ‘‘నా వ్యాఖ్యలను చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఆయన్ను ట్రోల్ చేస్తుంటే నాకు ఇబ్బందిగా ఉంది.. మేమంతా స్నేహితులం.. దుల్కర్, సోనమ్‌లంటే నాకు చాలా గౌరవం.. నా మాటల వల్ల వాళ్లు చాలా నెగెటివిటీని ఎదుర్కొంటున్నారు.. అందుకే వారికి క్షమాపణలు చెబుతున్నాను. ఇప్పటికైనా ఈ వివాదానికి తెరపడుతుందని ఆశిస్తున్నాను.. దయచేసి అర్థం చేసుకోండి’’ అని ట్వీట్ చేశారు.
నవీకరించబడిన తేదీ – 2023-08-15T17:25:19+05:30 IST