దేవర సినిమా : “దేవర” చిత్రం నుండి సైఫ్ అలీఖాన్‌కు ఎన్టీఆర్ పుట్టినరోజు బహుమతి.. “భైరా” పోస్టర్ విడుదల

ఎన్టీఆర్ దేవర సినిమా నుంచి సైఫ్ అలీఖాన్ పోస్టర్ విడుదలైంది

దేవర సినిమా: తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి వారసుడిగా “యంగ్ టైగర్ ఎన్టీఆర్” ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఇక రీసెంట్ గా వచ్చిన “RRR” సినిమాతో ప్రపంచ స్థాయికి చేరుకుంది. ఈ సినిమాలో నాటు నాటు అనే పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఎన్టీఆర్ క్రేజ్ అంతర్జాతీయ స్థాయిలో విపరీతంగా పెరిగిపోయిందనే చెప్పాలి. ఎన్టీఆర్ ప్రస్తుతం “దేవర” సినిమాలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో విలన్‌లుగా కనిపించనున్నారు.

నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఈ సినిమా రాబోతుండటం మరో విశేషం. అలాగే ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తమిళ రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా ఫుల్ మాస్ యాక్షన్ ఉంటుందని కొరటాల శివ ఇదివరకే చెప్పాడు. ఈ మేరకు రీసెంట్ గా టైటిల్ తో పాటు రిలీజ్ చేసిన తారక్ లుక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోందని మొదటి నుంచి చెబుతున్న మాటలకు ఈ పోస్టర్ మరింత ఊపునిచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది.

ఈరోజు సైఫ్ అలీఖాన్ పుట్టినరోజు సందర్భంగా దేవర సినిమా నుంచి సైఫ్ అలీఖాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ సినిమాలో సైఫ్ పాత్ర పేరు భైరా అని ప్రకటించారు. సముద్రం, అలల మధ్య భైరాని చూపించారు. సైఫ్ ఊర లాంగ్ హెయిర్ తో మాస్ గా కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్, సైఫ్ మధ్య యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి చిత్ర యూనిట్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేయగా.. మూడో షెడ్యూల్ కు రెడీ అవుతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో ఈ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. దాదాపు 10 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుందని టాక్. ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

 

పోస్ట్ దేవర సినిమా : “దేవర” చిత్రం నుండి సైఫ్ అలీఖాన్‌కు ఎన్టీఆర్ పుట్టినరోజు బహుమతి.. “భైరా” పోస్టర్ విడుదల మొదట కనిపించింది ప్రైమ్9.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *