వరుణుడు గెలిచాడు. డబ్లిన్‌లో జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్‌ను ఒక్క బంతి కూడా వేయకుండానే అంపైర్లు రద్దు చేశారు.
IRE vs IND : వరుణుడు గెలిచాడు. డబ్లిన్‌లో జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్‌ను ఒక్క బంతి కూడా వేయకుండానే అంపైర్లు రద్దు చేశారు. మూడు టీ20ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను గెలిచిన భారత్ 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
టీమ్ ఇండియా : నెంబర్ 4 స్థానానికి సరైనోడు ఎవరు..? 2019 ప్రపంచకప్ తర్వాత 12 మంది ఆడితే..
బుమ్రా సారథ్యంలో క్లీన్‌స్వీప్‌పై భారత్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం కారణంగా టాస్ సాధ్యం కాలేదు. వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో చాలా సమయం వృథా అయింది. ఎట్టకేలకు వరుణుడు శాంతించడంతో నష్టం వాటిల్లింది. ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారడం, ఎక్కువ సమయం లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
మూడో టీ20 వర్షం, తడి నేల పరిస్థితుల కారణంగా రద్దు చేయబడింది. భారత్ 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. #టీమిండియా #IREvIND pic.twitter.com/sbp2kWYiiO
— BCCI (@BCCI) ఆగస్టు 23, 2023
ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్‌తో భారత జట్టు తిరిగి బరిలోకి దిగనుంది.హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించే ఈ టోర్నీలో ఆరు జట్లు పాల్గొంటాయి. మొత్తం ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఎలో భారత్, పాకిస్థాన్, నేపాల్, గ్రూప్-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఉన్నాయి. గ్రూప్ దశలో ఆరు మ్యాచ్‌లు జరగనున్నాయి. గ్రూప్‌లలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-4కు అర్హత సాధిస్తాయి.
ఆసియా కప్ 2023 పూర్తి షెడ్యూల్
ఆగస్ట్ 30 – పాకిస్తాన్ vs నేపాల్ – వేదిక ముల్తాన్
ఆగస్టు 31 – బంగ్లాదేశ్ vs శ్రీలంక – వేదిక క్యాండీ
సెప్టెంబర్ 2 – పాకిస్తాన్ vs భారతదేశం – వేదిక క్యాండీ
సెప్టెంబర్ 3 – బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్ – వేదిక లాహోర్
సెప్టెంబర్ 4 – భారతదేశం vs నేపాల్ – వేదిక క్యాండీ
సెప్టెంబర్ 5 – శ్రీలంక vs ఆఫ్ఘనిస్తాన్ – వేదిక లాహోర్
సెప్టెంబర్ 6 – సూపర్ 4s – A1 vs B2 – వేదిక లాహోర్
సెప్టెంబర్ 9 – B1 vs B2 – వేదిక కొలంబో
సెప్టెంబర్ 10 – A1 vs A2 – వేదిక కొలంబో
సెప్టెంబర్ 12 – A2 vs B1 – వేదిక కొలంబో
సెప్టెంబర్ 14 – A1 vs B1 – వేదిక కొలంబో
సెప్టెంబర్ 15 – A2 vs B2 – వేదిక కొలంబో
సెప్టెంబర్ 17 – ఫైనల్ – వేదిక కొలంబో