సాయి ధరమ్ తేజ్ కోసం రాశి ఖన్నా తెలుగు, తమిళం మరియు హిందీ లిరిక్స్‌తో కూడిన మెలోడీ పాటను పాడింది.
రాశీఖన్నా: అందాల సుందరి రాశీఖన్నా.. ‘ఊహలు గుసుగుసలాడే’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత తెలుగుతో పాటు సౌత్‌లోని పలు భాషల్లో స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలను అందుకుంది. రాశి తన నటనతోనే కాకుండా తన గాత్రంతో కూడా అభిమానులను సంపాదించుకుంది. పలు తెలుగు సినిమాల్లో పాటలు పాడి ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఆమె సాయి ధరమ్ తేజ్ కోసం ఓ పాట పాడింది.
Mega Heroes : ఈ ఫోటోల్లో ఉన్న మెగా హీరోలు ఎవరో గుర్తుందా? అలాగే, ఆ పిక్ ఏ సమయంలో తీశారో తెలుసా?
సాయి ధరమ్ ‘సత్య’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలోని ఓ పాటను విడుదల చేశారు. శృతి రంజని సంగీతం సమకూర్చి పాట పాడారు. ఈ పాటను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేశారు. ఈ పాటను రాశి ఖన్నా మళ్లీ తన స్వరంలో పాడి సాయి ధరమ్ తేజ్‌కి గిఫ్ట్ ఇచ్చింది. రెండు నిమిషాల పాటలో తెలుగు, తమిళం, హిందీ లిరిక్స్ మేళవించి పాట హిట్ కొట్టింది. ఈ పాట విడుదల కాగానే రాశీఖన్నా వాయిస్ విన్న నెటిజన్లు.. ‘ఏం పాడారు భయ్యా.. ఆ వాయిస్‌లో ఏదో మ్యాజిక్ ఉందా?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ పాట ఒక్కసారి వినండి.
సీనియర్ హీరో నరేష్ తనయుడు నవీన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. 23 నిమిషాల ఈ చిత్రంలో 6 నిమిషాల పాట ఉంటుంది. దేశం కోసం ప్రాణాలర్పించే సైనికులే కాదు, దేశం కోసం తమ భర్తలను పంపే వారి భార్యల త్యాగాలే ఈ షార్ట్ ఫిల్మ్. సాయి ధరమ్ సైనిక్ భార్య పాత్రలో స్వాతిరెడ్డి నటించింది.