69వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలు వీరే.భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. 2021 సంవత్సరానికి గాను జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో జరిగిన జ్యూరీ విలేకరుల సమావేశంలో విజేతలను ప్రకటించారు.

జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప) ఎంపికయ్యారు. దీంతో 69 ఏళ్ల సినీ పరిశ్రమ చరిత్రలో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడిగా బన్నీ చరిత్ర సృష్టించాడు. కాగా ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో ఉత్తమ తెలుగు ఫీచర్ ఫిల్మ్ అవార్డు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’కు దక్కింది. అయితే వైష్ణవ్ తేజ్ కి ఇది మొదటి సినిమా. ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ విభాగంలో పురుషోత్తమాచార్యులు (తెలుగు)కి అవార్డు వచ్చింది. దీంతో పాటు నేషనల్ అవార్డ్స్ లోనూ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా హవా కొనసాగింది. ఏకకాలంలో ఆరు విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. ప్రతి విభాగంలో మొత్తం విజేతలు ఎవరు?

ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప: ది రైజ్)
ఉత్తమ నటి: అలియా భట్ (గంగూబాయి కరియావాడి), కృతిసనన్ (మిమి)
ఉత్తమ చిత్రం: రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్ (హిందీ)
ఉత్తమ తెలుగు చిత్రం – ఉప్పెన
ఉత్తమ దర్శకుడు: నిఖిల్ మహాజన్ (గోదావరి – మరాఠీ)
ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి (ది కాశ్మీర్ ఫైల్స్ హిందీ)
ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠి (MM-హిందీ)
ఉత్తమ యాక్షన్ దర్శకత్వం: కింగ్ సోలమన్ (RRR)
ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్రక్షిత్ (RRR)
ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్ (కొండపాలెం)
ఉత్తమ స్క్రీన్ ప్లే: నయట్టు (మలయాళం)
ఉత్తమ సంభాషణలు: గంగూబాయి కతియావాడి (హిందీ)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: సర్దార్ ఉద్దం (అవిక్ ముఖోపాధ్యాయ)
ఉత్తమ నేపథ్య గాయకుడు: శ్రేయ్ ఘోషల్ (ఇరివిన్ నిజాల్ – మాయవ చయ్యవా)
ఉత్తమ నేపథ్య గాయకుడు: కాల భైరవ (RRR- కొమురం భీముడు)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: వి శ్రీనివాస్ (RRR)
ఉత్తమ బాల నటుడు: భవిన్ రాబారి (ఛలో షో-గుజరాతీ)
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: RRR (రాజమౌళి)
ఉత్తమ సంగీతం (పాటలు): దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప)
ఉత్తమ సంగీతం (నేపథ్యం): కీరవాణి (RRR)
ఉత్తమ మేకప్: ప్రీతీషీల్ సింగ్ డిసౌజా (గుంగుబాయి కతియావాడి)
ఉత్తమ కాస్ట్యూమ్స్: వీర్ కపూర్ (సర్దార్ ఉద్దం సింగ్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: సర్దార్ ఉద్దం సింగ్ (దిమిత్రి మలిచ్, మాన్సీ ధ్రువ్ మెహతా)
ఉత్తమ ఎడిటింగ్: సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కతియావాడి)Leave a Reply

Your email address will not be published. Required fields are marked *