తెలంగాణ వానలు : బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో మూడు రోజులుగా భారీ నుంచి అతిభారీ వర్షాలు

తెలంగాణ వానలు : బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో మూడు రోజులుగా భారీ నుంచి అతిభారీ వర్షాలు

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఐదు చోట్ల 11 సెంటీమీటర్ల నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం జానంపేటలో 158.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

తెలంగాణ వానలు : బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో మూడు రోజులుగా భారీ నుంచి అతిభారీ వర్షాలు

తెలంగాణ వర్షాలు (11)

తెలంగాణలో భారీ వర్షాలు : తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో రెండు మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడన ప్రభావంతో మరో రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 30 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

వాతావరణ శాఖ రెండు రోజుల పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఎల్లుండి మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఐదు చోట్ల 11 సెంటీమీటర్ల నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం జానంపేటలో 158.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

భారీ వర్షం: హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో 144.2 మి.మీ వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లా పాలకేడు మండలం అమలంగాపురంలో 135.0 మి.మీ వర్షపాతం నమోదైంది. వనపర్తి జిల్లా ఘన్‌పూర్‌లో 121 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్‌లో వాతావరణం మారిపోయింది.

నగరంలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది.

డెయిరీ ఫామ్ : వర్షాకాల పాడిపరిశ్రమలో జాగ్రత్తలు

గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, కృష్ణానగర్, ఫిల్మ్ నగర్, అమీర్ పేట్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, షేక్ పేట్, మణికొండ, రాయదుర్గం, మెహిదీపట్నం, టోలీచౌకి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో భారీ వర్షం కురుస్తోంది. చింతల్, సుచిత్ర, జీడిమెట్ల, బాలానగర్, కూకట్ పల్లి సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *