ఏకరాళ్లెక్కన అమరావతి భూములు వేలానికి సిద్ధం!

ఏపీ ప్రభుత్వం అమరావతిని కొనసాగించి ఉంటే… లక్షల కోట్ల ప్రజాధనం ఆస్తి రూపంలో సిద్ధంగా ఉండేది. కానీ దాన్ని స్మశాన వాటికగా అభివర్ణించి అలాగే ట్రీట్ చేసి.. ఇప్పుడు రాజకీయాల కోసం… ఆదాయం కోసం అదే శ్మశాన వాటికలో ప్లాట్లు అమ్ముకోవడానికి వెనుకాడటం లేదు. ఇటీవల రాజధానిలో భూముల విక్రయానికి సంబంధించి 389, 390లను జారీ చేశారు. మంగళగిరి మండలం నవులూరు రెవెన్యూలో పదెకరాలు, తుళ్లూరు మండలం పిచ్చుకలపాలెం రెవెన్యూలో నాలుగు ఎకరాలు రాజధాని మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం విక్రయానికి ఉంచారు. ప్రత్యేక జోన్‌లో రాజధాని భూములను ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఊదరగొట్టిన వైసీపీ ప్రభుత్వం కేవలం భూముల వేలంపైనే దృష్టి సారించింది. ఇందుకోసం కోర్ క్యాపిటల్‌లో రెండు చోట్ల 14 ఎకరాలను ఎంపిక చేశారు. నవులూరులో ఎకరాకు రూ.5.94 కోట్లు, పిచ్చికలపాలెంలో 5.41 కోట్లు. ఈ మేరకు సీఆర్డీఏ వేలం నోటీసు జారీ చేసింది. అమరావతి అభివృద్ధి కోసమే భూములను వేలం వేస్తున్నట్లు సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. స్పందన మేరకు భూముల వేలం ప్రక్రియ కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు. గతంలో వేలం వేస్తామని ప్రకటించినా స్పందన లేకపోవడంతో ఆగిపోయింది.

అయితే ఈ అమరావతి పొలాలను ఎన్నికల ముందు తక్కువ ధరకు అస్మదీయులకు వేలం వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమరావతిలో ఎలాంటి పనులు చేయకుండా… రైతులకు కనీసం కౌలు కూడా చెల్లించకుండా… వారు ఇచ్చిన పొలాలను ఎలా అమ్ముకుంటారన్న వాదన వినిపిస్తోంది. ప్రతి విషయంలోనూ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. కోర్టు ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. భూముల క్రయవిక్రయాలపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా పట్టించుకోవడం లేదు.

తెలుగు360 ఉత్తమ మరియు ప్రకాశవంతమైన జర్నలిస్టుల కోసం ఎల్లప్పుడూ తెరవబడి ఉంటుంది. మీకు పూర్తి సమయం లేదా ఫ్రీలాన్స్ పట్ల ఆసక్తి ఉంటే, మాకు ఇమెయిల్ చేయండి Krishna@telugu360.com.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *