ధనుష్: ఆ అమ్మాయి వల్ల జీవితం నాశనం అయ్యింది.. అంటూ ధనుష్ చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అయ్యాయి.

తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిటెక్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు రఘువరన్.

ధనుష్: ఆ అమ్మాయి వల్ల జీవితం నాశనం అయ్యింది.. అంటూ ధనుష్ చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అయ్యాయి.

ధనుష్

ధనుష్ తొలి ప్రేమకథ: తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిటెక్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు రఘువరన్. ఆయన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతున్నాయి. ఈ ఏడాది తెలుగులో సర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను పెళ్లాడిన ధనుష్ ఇటీవలే ఆమెకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు.

ధనుష్‌కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధనుష్.. ఇంటర్లో ఓ అమ్మాయిని ప్రేమించానని చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Manchu Manoj : వెండితెరపై మంచు మనోజ్ రీఎంట్రీ లేదా..? తెరపై కూడా..!

తాను 10వ తరగతి చదువుతున్నప్పుడు బాగా చదివేవాడినని, ఎప్పుడూ క్లాస్‌లో టాపర్‌గా ఉండేవాడినని తెలిపారు. అయితే ఇంటర్ కి వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. ఆ సమయంలో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డానని చెప్పాడు. అప్పటి నుంచి చదువు ఆగిపోయిందన్నారు. ఆ అమ్మాయితో కబుర్లు చెప్పడమే పనిగా పెట్టుకుని చదువును గాలికి వదిలేశానని చెప్పాడు. ఇంటర్‌లోనూ అదే మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. ఆ అమ్మాయి వల్ల తన ఇంటర్ లైఫ్ నాశనమైందని, లేకుంటే ఇంటర్ లో మంచి మార్కులు కొట్టేవాడినని సార్ సినిమా ప్రమోషన్స్ లో ధనుష్ సరదాగా ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఇదిలావుంటే.. ధనుష్ ప్రస్తుతం ‘కెప్టెన్ మిల్లర్’ సినిమాలో నటిస్తున్నాడు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తోంది. ఈ భారీ బడ్జెట్ మూవీలో సందీప్ కిషన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

రామ్ చరణ్: ప్రభాస్ ఛాలెంజ్ స్వీకరించిన రామ్ చరణ్.. నెల్లూరు చేపల పులుసు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *