కోవిడ్-19: కరోనా చికిత్స తర్వాత పసిపిల్లల కళ్లు నీలం రంగులోకి మారాయి

కోవిడ్‌తో చికిత్స పొందుతున్న ఓ చిన్నారి కళ్లు నీలం రంగులోకి మారిన ఘటన చోటుచేసుకుంది. ఆ మందు వల్లనే అని వైద్యులు తెలిపారు. వెంటనే ఆ ఔషధం వాడటం మానేయాలని సూచించారు.

కోవిడ్-19: కరోనా చికిత్స తర్వాత పసిపిల్లల కళ్లు నీలం రంగులోకి మారాయి

కోవిడ్-19కి చికిత్స

కోవిడ్ 19 చికిత్స: కరోనాకు ముందు, కరోనా తర్వాత ప్రపంచం మారిపోయింది. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న కోవిడ్ ఛాయలు ఇప్పటికీ వీడటం లేదు. మరీ ముఖ్యంగా కోవిడ్‌కు చికిత్స పొందిన వారు అనేక సమస్యలతో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్‌ చికిత్స పొందిన ఓ చిన్నారి కళ్లు నీలం రంగులోకి మారిన ఘటన థాయ్‌లాండ్‌లో చోటుచేసుకుంది.

కరోనా వైరస్ (కోవిడ్ 19 ట్రీట్‌మెంట్) కోసం చికిత్స తీసుకున్న పసిపిల్లల కళ్లు నీలం రంగులోకి మారాయి. మెడికల్ జర్నల్ ఫ్రాంటియర్స్ ఇన్ పీడియాట్రిక్స్ కథనం ప్రకారం…థాయ్‌లాండ్‌కు చెందిన ఆరు నెలల పసిబిడ్డకు జ్వరం వచ్చింది. దగ్గుతో పాటు జ్వరం వచ్చింది. తల్లిదండ్రులు చిన్నారిని వైద్యుడి వద్దకు తీసుకెళ్లి కోవిడ్‌ పరీక్షలు చేయించారు. రిపోర్టుల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మూడు రోజుల పాటు ఆ చిన్నారికి ఫెవిపిరావిర్ మెడిసిన్‌తో చికిత్స అందించారు. చిన్నారి ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

శివలింగం : తన కోరిక తీర్చనందుకు శివుడిపై కోపగించుకున్న యువకుడు గుడిలోని శివలింగాన్ని దొంగిలించి ఏం చేసాడు..

అయితే కొన్ని గంటల తర్వాత ఆ చిన్నారి కళ్ల రంగు మారిపోయింది. 18 గంటల్లో, పిల్లల కళ్ళు ముదురు గోధుమ రంగు నుండి నీలం రంగులోకి మారాయి. దీంతో ఆందోళన చెందిన చిన్నారి తల్లిదండ్రులు మళ్లీ డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లారు. చిన్నారిని పరీక్షించిన వైద్యుడు వెంటనే ఫేవిపిరావిర్ మందు వాడడం మానేయాలని సూచించారు. ఐదు రోజుల తరువాత, శిశువు కళ్ళు సాధారణ స్థితికి వచ్చాయి. ఆ మందు వాడటం మానేసి ఐదో రోజు కళ్లు మామూలు స్థితికి వచ్చాయన్నాడు.

ఇంతలో, పిల్లలకు కోవిడ్ చికిత్సగా 2022లో థాయ్ ప్రభుత్వం అనుమతించింది. మితమైన లక్షణాలు ఉన్నవారికి ఈ ఔషధాన్ని ఉపయోగించమని సిఫార్సు చేయబడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *