జీ-20 డిన్నర్: సీఎం నవీన్ పట్నాయక్ డుమ్మా..!

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-09-09T18:35:09+05:30 IST

జి-20 సదస్సు ప్రారంభం సందర్భంగా అతిథుల గౌరవార్థం శనివారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే విందుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హాజరుకావడం లేదు. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. అయితే తాను గైర్హాజరు కావడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.

జీ-20 డిన్నర్: సీఎం నవీన్ పట్నాయక్ డుమ్మా..!

భువనేశ్వర్: G-20 శిఖరాగ్ర సదస్సు ప్రారంభం సందర్భంగా అతిథుల గౌరవార్థం శనివారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే విందుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హాజరుకావడం లేదు. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. అయితే తాను గైర్హాజరు కావడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. రాష్ట్రపతి విందులో పాల్గొనాల్సిందిగా కేబినెట్, సహాయ మంత్రులు, ముఖ్యమంత్రులు, భారత ప్రభుత్వ కార్యదర్శులందరికీ ఆహ్వానాలు పంపబడ్డాయి.

రాష్ట్రపతి విందులో పాల్గొంటారని ముఖ్యమంత్రులు నితీశ్ కుమార్, హేమంత్ సోరెన్, మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ ఇప్పటికే ధృవీకరించారు. అయితే కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో ముఖ్యమంత్రి గైర్హాజరయ్యే అవకాశం ఉంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముందస్తు ఏర్పాట్ల కారణంగా విందు కార్యక్రమానికి హాజరుకావడం లేదని అధికారిక సమాచారం ఇవ్వగా, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ హాజరును ఇంకా ధృవీకరించలేదు. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్‌డి దేవెగౌడ ఆరోగ్య కారణాల వల్ల విందుకు హాజరు కాలేకపోతున్నారని కేంద్రానికి తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే సహా రాజకీయ నేతలకు ఆహ్వానం అందలేదు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ కాంప్లెక్స్‌లోని భారత్ మండపం వద్ద విందు కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.

నవీకరించబడిన తేదీ – 2023-09-09T18:35:09+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *