గత వారం ర్యాలీతో మార్కెట్ సెంటిమెంట్ మరింత మెరుగుపడింది. బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ ప్రధానంగా ఫ్రంట్‌లైన్ స్టాక్‌లతో పాటు దీనికి దోహదపడింది. ఈ వారం కూడా మార్కెట్‌లో ర్యాలీ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. సాంకేతికంగా నిఫ్టీ ఈ వారం 20,000 పాయింట్ల కీలక మైలురాయిని తాకే అవకాశం ఉంది. అయితే వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. డిప్స్ కోసం ఓపికగా వేచి ఉండి, లాంగ్ పొజిషన్లు తీసుకోవడం మంచిది. సాంకేతికంగా నిఫ్టీకి 19700 వద్ద పటిష్టమైన మద్దతు ఉంది. అది దిగువన బ్రేక్ అయితే 19600-19500 కీలక మద్దతు స్థాయిగా పరిగణించాలి. వీటితో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను నిశితంగా గమనించి వ్యాపారులు పొజిషన్లు తీసుకోవడం మంచిది.
ఈ వారం స్టాక్ సిఫార్సులు:
1. CDSL: గత వారం చివరి రెండు రోజుల్లో ఈ కౌంటర్లో ట్రేడింగ్ వాల్యూమ్స్ గణనీయంగా పెరిగాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈలో స్క్రిప్ రూ.1,282.30 వద్ద ముగిసింది. డైలీ చార్టుల ప్రకారం ఈ వారం కూడా సీడీఎస్ఎల్ షేర్లు చురుగ్గా ట్రేడ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రూ.1,395 లక్ష్యంతో వ్యాపారులు రూ.1,270-1,280 మధ్య పొజిషన్లు తీసుకోవచ్చు. రూ.1,218 ఫర్మ్ స్టాప్ లాస్‌గా ఉంచాలి.
2. రెయిన్ ఇండస్ట్రీస్: గత వారం చివరి రెండు రోజుల్లో ఈ కౌంటర్లో ట్రేడైన షేర్ల పరిమాణం గణనీయంగా పెరిగింది. ఇది రూ.170-172 కీలక మద్దతు స్థాయిని దాటింది. షేర్ల సగటు రోజువారీ ట్రేడింగ్ పరిమాణం కూడా పెరిగింది. సాంకేతికంగా ఈ కౌంటర్ ఇప్పటికీ అప్‌ట్రెండ్‌గానే కనిపిస్తోంది. వ్యాపారులు స్వల్పకాలిక లక్ష్యం రూ.1909-1920తో రూ.178-180 మధ్య పొజిషన్లు తీసుకోవచ్చు. రూ.172 ఫర్మ్ స్టాప్‌లాస్‌గా సెట్ చేయాలి.
సమీత్ చవాన్, చీఫ్ అనలిస్ట్, టెక్నికల్,
డెరివేటివ్స్, ఏంజెల్ వన్ లిమిటెడ్
గమనిక: పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు పెట్టుబడిదారులు తమ ఆర్థిక సలహాదారులను సంప్రదించాలి.
నవీకరించబడిన తేదీ – 2023-09-11T00:58:50+05:30 IST