స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జగన్ అండ్ కో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా వైసీపీ నేతలు ఈ విషయాన్ని ఆధారాలతో సహా నిర్ధారిస్తున్నారు. జగ్గయ్యపేటలో వైసీపీ నేత సామినేని ఉదయభాను ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది. చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన సందర్భంగా థ్యాంక్స్ జగన్ పేరుతో సామినేని ఉదయభాను ఫ్లెక్సీని ఏర్పాటు చేసి అందులో సీనియర్ ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఈ ఫ్లెక్సీపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇష్టానుసారంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.
ఇంతకీ ఫ్లెక్సీలో ఏముంది..?
ధన్యవాదాలు జగన్ గారు.. నా ఆత్మకు శాంతి చేకూర్చారు.. చివరి దశలో ఎన్నో అవమానాలకు గురయ్యాను, అత్యంత వేదనకు గురయ్యాను.. నా చావుకు కారణమైన కిరాతకుడు చంద్రబాబు.. నా మరణానంతరం నా చావును ఉపయోగించుకోనివ్వండి. కుటిల రాజకీయాలకు కొడుకు హరికృష్ణ చావు.. ఆఖరికి మనవడు తారకరత్న కూడా చావాలి. కొడుకును నీచ రాజకీయాలకు వాడుకున్న నీచానికి బుద్ది చెప్పి “నా ఆత్మకు శాంతి చేకూర్చారు” ఆత్మ శాంతి దినం.
ఈ ఫ్లెక్సీ చూస్తుంటే వైసీపీ అధినేత జగన్ కావాలని టీడీపీ అభిమానులు కుట్ర పన్నారని, చంద్రబాబును జైలుకు పంపారని స్పష్టమవుతోంది. ఈ విషయాన్ని వైసీపీ నేతలు బహిరంగంగా ఫ్లెక్సీల ద్వారా చెబుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. వైసీపీ చేస్తున్న కుటిల రాజకీయాలను ఏపీ ప్రజలు ఇప్పటికైనా తెలుసుకోవాలన్నారు. తమ అభిమాన నేత చంద్రబాబుకు మద్దతుగా సంఘీభావం తెలపకుండానే ఏపీలో 144 సెక్షన్ విధించారంటూ పలువురు టీడీపీ అభిమానులు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: