హర్యానాలోని భివానీలో సంచలనం సృష్టించిన ఇద్దరు వ్యక్తులను సజీవ దహనం చేసిన కేసులో నిందితుడైన గో సంరక్షకుడు మోను మనేసర్‌ను మంగళవారం రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. భివానీలో, గత ఫిబ్రవరిలో రాజస్థాన్‌లోని మైనారిటీ వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తమ కారుతో పాటు సజీవ దహనమయ్యారు.
చండీగఢ్: హర్యానాలోని భివానీలో సంచలనం సృష్టించిన ఇద్దరు వ్యక్తులను సజీవ దహనం చేసిన కేసులో నిందితుడైన గో సంరక్షకుడు మోను మనేసర్‌ను మంగళవారం రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. భివానీలో, గత ఫిబ్రవరిలో రాజస్థాన్‌కు చెందిన మైనారిటీ వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తమ కారుతో పాటు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో నిందితుడు మోను మనేసర్‌ను మార్కెట్ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని రాజస్థాన్ పోలీసులకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇద్దరు వ్యక్తుల సజీవ దహనంలో మనేసర్ ప్రత్యక్షంగా పాల్గొననప్పటికీ, ఈ సంఘటనకు సహకరించారా లేదా కుట్ర జరిగిందా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు రాజస్థాన్ పోలీసులు గత నెలలో తెలిపారు.
ఫిబ్రవరి 16న హర్యానాలోని భివానీలో వాహనంలో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమై కనిపించారు. మృతులు రాజస్థాన్‌కు చెందిన నాసిర్ (25), జునైద్ అలియాస్ జునా (35)గా గుర్తించారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న 21 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వారిలో మోను మనోసర్ కూడా ఉన్నాడు. బజరంగ్ దళ్ సభ్యులు నసీర్, జునైద్‌లను కిడ్నాప్ చేసి కారుతో సహా సజీవ దహనం చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను భజరంగ్ దళ్ ఖండించింది. సజీవ దహనమైన ఇద్దరి వాహనంపై ఉన్న రక్తపు మరకలు ఒకటేనని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా నిర్ధారించింది. ఈ ఘటనపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మానేసర్‌పై పోలీసులు స్వేచ్ఛగా చర్యలు తీసుకుంటారని, అతని కోసం గాలిస్తున్నారని చెప్పారు. మనేసర్‌ను పట్టుకునేందుకు రాజస్థాన్ పోలీసులకు అవసరమైన సహాయం అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
నవీకరించబడిన తేదీ – 2023-09-12T14:47:45+05:30 IST