సీఎం జగన్ బుధవారం ఢిల్లీ వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్ ఢిల్లీ పర్యటనలో రెండు రోజులు బిజీబిజీగా గడపనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఉత్కంఠ పరిస్థితుల దృష్ట్యా జగన్ లండన్ నుంచి తిరిగి వచ్చిన మరుసటి రోజే ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందా.. అందుకే జగన్ ఢిల్లీ వెళ్లి ఈ లెక్కలు వివరిస్తారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఏపీ సీఎం జగన్ లండన్ పర్యటన ముగించుకుని మంగళవారం ఉదయం విజయవాడ చేరుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో జగన్ విదేశీ పర్యటన నుంచి తిరిగి రావడం, ఆయన స్పందనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. లండన్ నుంచి వచ్చిన జగన్ ఆదేశాల మేరకే చంద్రబాబును ఇక్కడి పోలీసులు అరెస్ట్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన తర్వాత కీలక నేతలతో జగన్ చేస్తున్న సమీక్ష కూడా అనుమానాస్పదంగా ఉంది. చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు, రిమాండ్ కు పంపిన తీరు, రాష్ట్రంలో తదనంతర పరిణామాలపై జగన్ సమీక్షించినట్లు తెలుస్తోంది.
మరోవైపు సీఎం జగన్ బుధవారం ఢిల్లీ వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్ ఢిల్లీ పర్యటనలో రెండు రోజులు బిజీబిజీగా గడపనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఉత్కంఠ పరిస్థితుల దృష్ట్యా జగన్ లండన్ నుంచి తిరిగి వచ్చిన మరుసటి రోజే ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందా.. అందుకే జగన్ ఢిల్లీ వెళ్లి ఈ లెక్కలు వివరిస్తారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. జీ20 సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు.. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై ఇంతవరకు స్పందించలేదు. బాబు అరెస్ట్ విషయమై జగన్ తమతో చర్చిస్తారని కొందరు భావిస్తున్నారు. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విదేశాల్లోని కేమన్ ఐలాండ్స్ బ్యాంక్ ప్రతినిధులతో నగదు లావాదేవీల వ్యవహారంపై మాట్లాడేందుకు జగన్ ఢిల్లీ వెళ్తున్నారా అనే చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది. ఎందుకంటే లండన్ ట్రిప్ పేరుతో జగన్ కేమన్ ఐలాండ్స్ వెళ్లారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ విషయంపై వైసీపీ నేతలు స్పందించలేదు.
ఇది కూడా చదవండి: NCBN అరెస్ట్ : చంద్రబాబు అరెస్ట్ తర్వాత నారా లోకేష్ కీలక నిర్ణయం
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలపై కేంద్రంతో జగన్ చర్చలు జరపనున్నట్లు సమాచారం. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే తాము సిద్ధమని జగన్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే చంద్రబాబును మరిన్ని కేసుల్లో ఇరికించి రాజకీయంగా దెబ్బతీసేందుకు ఢిల్లీ పెద్దలు జగన్ ను పిలిపించుకుంటున్నారా అనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. జగన్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాడో తెలియక వైసీపీ నేతలు కూడా అయోమయంలో పడ్డారు.
నవీకరించబడిన తేదీ – 2023-09-12T13:48:41+05:30 IST