చంద్రబాబు అరెస్ట్: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా..ఏసీబీ కోర్టుకు కీలక ఆదేశాలు..

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది.

చంద్రబాబు అరెస్ట్: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా..ఏసీబీ కోర్టుకు కీలక ఆదేశాలు..

ఏపీ హైకోర్టు

చంద్రబాబు నాయుడు కేసు: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు బుధవారం విచారించింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు తమ వాదనలు వినిపించగా, సీఐడీ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తమ వాదనలు వినిపించారు. చంద్రబాబుపై ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని న్యాయవాదులు కోర్టును కోరారు. ఆధారాలు లేకపోయినా రాజకీయ ప్రతీకారం కోసమే కేసు పెట్టారని చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్ లో వివరించారు. అయితే ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు క్వాష్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. దీనిపై పూర్తి వాదనలు వినాల్సి ఉందని ఏపీ హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.

చంద్రబాబు అరెస్ట్: చంద్రబాబుకు మరో షాక్.. హౌస్ రిమాండ్ పిటిషన్ కొట్టివేత

మరోవైపు సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. ఈ నెల 18 వరకు విచారణ చేపట్టవద్దని ఏసీబీ కోర్టును ఆదేశించింది. చంద్రబాబును ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని చంద్రబాబు తరపు న్యాయవాది లూత్రా హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సీఐడీ పిటిషన్‌పై ఎలాంటి విచారణ చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. అదే విధంగా అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది.

చంద్రబాబు నాయుడు : చంద్రబాబు భద్రతపై ఏసీబీ కోర్టులో వాదనలు

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఏపీలో ప్రభుత్వం కావాలనే కుట్రతో చంద్రబాబును అరెస్ట్ చేసి అక్రమ కేసులు బనాయించారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా విశాఖలో టీడీపీ ముఖ్య నేతలు ఆందోళనకు దిగారు. జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపిన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే వెలగపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *